Abn logo
Sep 22 2021 @ 12:31PM

రోహిణి సింధూరిపై చర్యలు తథ్యం

బెంగళూరు: మైసూరు జిల్లా అధికారిగా ఉన్న సమయంలో రోహిణి సింధూరి పలు అక్రమాలకు పాల్పడినట్టు జేడీఎస్‌ సభ్యుడు సా రా మహేశ్‌ ఆరోపించారు. ఆమెపై శాసనసభలో హక్కుల ఉల్లంఘన ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని కోరారు. అయితే ఇందుకు అంగీకరించని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి జేసీ మాధుస్వామి ఈ అంశం హక్కుల ఉల్లంఘన కిందకు రాదని ఒకవేళ అప్పటి జిల్లా అధికారి సింధూరి అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే చర్యలు తప్పవన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని సా రా మహేశ్‌ నేరుగా స్పీకర్‌ పోడియంలోకి దూసుకొచ్చి ధర్నా ప్రారంభించారు. సింధూరిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ధర్నాను విరమించుకున్నారు.