ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఐసీసీ క్లారిటీ

ABN , First Publish Date - 2020-04-07T02:40:07+05:30 IST

చైనాలో పుట్టి యావత్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక క్రీడా

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఐసీసీ క్లారిటీ

దుబాయ్: చైనాలో పుట్టి యావత్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, ఫిఫా టోర్నమెంట్లను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. క్రికెట్‌లో ఐపీఎల్‌లో పాటు పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా వాయిదా వేసుకన్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటమో.. లేక పూర్తిగా రద్దు కావడమో జరుగుతుందని అంతా భావించారు. కానీ,  టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు జరుగుతుందని ఐసీసీ ప్రకటించి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందించింది. 


ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్లలో ఐసీసీ టీ-20 ప్రపంచకప్ నిర్వహించాలని షెడ్యూల్‌ను అనుకుంది. అయితే పెద్ద ఈవెంట్లు సహితం వాయిదా పడటంతో.. ఇది అదే విధంగా వాయిదాపడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఐసీసీ తాజా ప్రకటనతో ఈ ప్రశ్నలకు చెక్ పెట్టింది. 


‘‘కరోనా వైరస్ సంక్షోభంపై ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మానిటరింగ్ కమిటీ విస్తృతంగా సమీక్షిస్తుంది. స్థానిక అధికారుల సహాయంతో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇది ఇలాగే కొనసాగుతుంది కూడా. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియంలు వేదికలుగా.. 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 20 వరకూ జరుగుతుంది. తొలుత అనుకున్న ప్రకారమే ఈవెంట్ నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాము’’ అని ఐసీసీ ప్రకటించింది. అయితే ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకుంటే మాత్రం ఈ టోర్నమెంట్‌ని రద్దు చేయడమో లేదా.. 2022కు వాయిదా వేయడమో చేయాలని కొందరు అంటున్నారు. 

Updated Date - 2020-04-07T02:40:07+05:30 IST