ఆ టెస్టులు ఫిక్స్‌ కాలేదు

ABN , First Publish Date - 2021-05-18T05:48:35+05:30 IST

మూడేళ్ల క్రితం అల్‌ జజీరా చానెల్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో ఆడిన టెస్టుల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందంటూ సంచలన కథనాలు ప్రసారం చేసింది...

ఆ టెస్టులు ఫిక్స్‌ కాలేదు

దుబాయ్‌: మూడేళ్ల క్రితం అల్‌ జజీరా చానెల్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో ఆడిన టెస్టుల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందంటూ సంచలన కథనాలు ప్రసారం చేసింది. ‘క్రికెట్‌ మ్యాచ్‌ ఫిక్సర్స్‌’ అనే పేరిట 2018లో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. అందులో అనిల్‌ మున్నావర్‌ అనే బుకీ.. 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుతో పాటు 2017లో ఆసీ్‌సతో రాంచీలో జరిగిన టెస్టు కూడా ఫిక్స్‌ అయినట్టుగా పేర్కొన్నాడు. అయి తే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. అవన్నీ కేవలం ఊహాజనిత కథనాలేనని, ఆ ఆరోపణలు నమ్మశక్యంగా కనిపించడం లేదంటూ పేర్కొంది. అప్పట్లోనే ఐసీసీ నలుగురు బెట్టింగ్‌, క్రికెటింగ్‌ స్పెషలి్‌స్టలచే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అలాగే ఆ కథనంలో ప్రసారమైన క్రికెటర్లు హసన్‌ రజా (పాక్‌), తరంగ ఇండిక, తరిందు మెండిస్‌ (శ్రీలంక)లను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. 


Updated Date - 2021-05-18T05:48:35+05:30 IST