కరోనాలోనూ... వేతనాలు పెరిగాయి

ABN , First Publish Date - 2020-07-08T18:18:04+05:30 IST

కరోనా... ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మరి. దీని ప్రభావం నేపధ్యంలో వివిధ రంగాలు, సంస్థలతోపాటు ఇటు ఉద్యోగులు సైతం నానా అవస్థలు పడుతోన్న విషయం తెలిసిందే. అయితే... ఇంత కష్టకాలంలో కూడా ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తన ఉద్యోగులకు వేతనాలను పెంచడం విశేషం. దేశంలో ప్రైవేటు రంగంలో రెండవ అతి పెద్ద బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో... ఇతర బ్యాంకులు, వాణిజ్యవర్గాలు నివ్వెరపోయాయి.

కరోనాలోనూ... వేతనాలు పెరిగాయి

ముంబై : కరోనా... ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మరి. దీని ప్రభావం నేపధ్యంలో వివిధ రంగాలు, సంస్థలతోపాటు ఇటు ఉద్యోగులు సైతం నానా అవస్థలు పడుతోన్న విషయం తెలిసిందే. అయితే... ఇంత కష్టకాలంలో కూడా ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తన ఉద్యోగులకు వేతనాలను పెంచడం విశేషం. దేశంలో ప్రైవేటు రంగంలో రెండవ అతి పెద్ద బ్యాంకుగా ఉన్న ఐసీఐసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో... ఇతర బ్యాంకులు, వాణిజ్యవర్గాలు నివ్వెరపోయాయి.


కరోనా సంక్షోభంలో కూడా అందించిన సేవలను గుర్తిస్తూ... ఉద్యోగులకు వేతనాలను పెంచినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంరభమైన ‘2020-21 ఆర్థిక సంవత్సరం’లో ఉద్యోగులకు ఎనిమిది శాతం మేరకు వేతనాల్లో పెంపు ఈ నెల(జులై) నుంచి అమలవుతుంది. 


Updated Date - 2020-07-08T18:18:04+05:30 IST