శ్రీలంకలో కార్యకలాపాలు నిలిపివేసిన ఐసీఐసీఐ

ABN , First Publish Date - 2020-10-25T05:23:58+05:30 IST

శ్రీలంకలో కార్యకలాపాలు నిలిపివేసిన ఐసీఐసీఐ

శ్రీలంకలో కార్యకలాపాలు నిలిపివేసిన ఐసీఐసీఐ

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు శనివారం నుంచి శ్రీలంకలో కార్యకలాపాలను నిలిపివేసింది. శ్రీలంక ద్రవ్య ప్రాధికార సంస్థ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత తాము ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసినట్టు బ్యాంకు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు విజ్ఞప్తి మేరకు శ్రీలంక కేంద్రీయ బ్యాంకు ద్రవ్య విధాన బోర్డు శ్రీలంకలో బ్యాంకు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసేందుకు అనుమతి ఇచ్చిందనీ.. బ్యాంకుకు ఇచ్చిన లైసెన్సును కూడా రద్దు చేసిందని ఓ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సదరు బ్యాంకు వెల్లడించింది. ‘‘ద్రవ్య విధాన బోర్డు నియమ, నిబంధనలకు అనుగుణంగా బ్యాంకు నడుచుకోవడంపై సంతృప్తి చెందిన డైరెక్టర్ ఆఫ్ బ్యాంకు సూపర్‌విజన్... శ్రీలంకలో బ్యాంకు కోసం ఇచ్చిన లైసెన్సును రద్దు చేసేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయం 2020 అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుంది...’’ అని ఈ ప్రయివేటు బ్యాంకు పేర్కొంది. 

Updated Date - 2020-10-25T05:23:58+05:30 IST