ఐసీఐసీఐ బ్యాంక్‌ వాట్సాప్‌ బ్యాంకింగ్‌

ABN , First Publish Date - 2020-10-19T05:51:12+05:30 IST

ఐసీఐసీఐ బ్యాంక్‌ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ను ప్రారంభించింది. దీని సహాయంతో కస్టమర్లు వాట్సాప్‌ సందేశం పంపడం ద్వారా క్షణాల వ్యవధిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ వాట్సాప్‌ బ్యాంకింగ్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ను ప్రారంభించింది. దీని సహాయంతో కస్టమర్లు వాట్సాప్‌ సందేశం పంపడం ద్వారా క్షణాల వ్యవధిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. అలాగే ఇంటిలో కూచునే విద్యుత్‌, గ్యాస్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ బిల్లు చెల్లింపులు చేయవచ్చు.

అలాగే కార్పొరేట్‌ కంపెనీలు, ఎంఎ్‌సఎంఈలు కస్టమర్‌ ఐడీ, దిగుమతి ఎగుమతి (ఐఈ) కోడ్‌, బ్యాంకులో రుణసదుపాయానికి సంబంధించిన సమాచారం, తమకు అందాల్సిన చెల్లింపుల తాజా స్థితి వంటివన్నీ కార్యాలయాల్లో ఉండి లేదా ప్రయాణాల్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు.

అలాగే తమ ఖాతాలో నిల్వ ఎంత ఉన్నది కూడా సాధారణ కస్టమర్లతో పాటు కార్పొరేట్‌ కస్టమర్లు తెలుసుకోవచ్చు. 


Updated Date - 2020-10-19T05:51:12+05:30 IST