Abn logo
Sep 28 2021 @ 20:21PM

ఐసీఐసీఐ... వారికి క్షణాల్లో డబ్బులు

హైదరాబాద్: ప్రైవేటురంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు ఓ వెసులుబాటు కల్పించింది.  దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న సెల్లర్లకు సులభంగానే తక్షణం ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నందించనుంది. దీనికింద... ఏకంగా రూ. 25 లక్షల వరకు రుణాన్ని పొందొచ్చు. డిజిటల్ రూపంలో ఈ వెసులుబాటు ఉంటుంది. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేదు. అమెజాన్ ద్వారానే ఆన్‌లైన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ కోసం దరఖాస్తు  చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఆధారంగా వెంటనే ఆమోదం లభిస్తుంది.


డబ్బులు కూడా సెల్లర్ విక్రయదారు ఖాతాలో తక్షణమే  జమవుతాయి. ఇక... ఉపయోగించుకున్న డబ్బుకే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యానికి ఆటో రెన్యూవల్ ఆప్షన్ కూడా ఉండనుండడం గమనార్హం. రీపేమెంట్ ఆధారంగా ఆటో రెన్యూవల్ ప్రయోజనాన్ని పొందొచ్చు. అర్హత కలిగిన విక్రయదారులు... వారి అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఐషీఐషీఐ బ్యాంక్ ఇన్‌స్టా ఓడీ ప్లాట్‌ఫామ్ తెరచుకుంటుంది. లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలి. ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్ పొందొచ్చు. కొత్త సెల్లర్లు అయితే ముందుగా ఐసీఐసీఐలో కరెంట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది.