మెరుగుపడిన ఐసీఐసీఐ బ్యాంక్ ర్యాంక్!

ABN , First Publish Date - 2021-04-09T19:23:04+05:30 IST

భార‌త‌దేశ‌పు రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌ 2021 మొద‌టి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది.

మెరుగుపడిన ఐసీఐసీఐ బ్యాంక్ ర్యాంక్!

భార‌త‌దేశ‌పు రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌ 2021 మొద‌టి  త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది. `ఆసియా-ప‌సిఫిక్` 20 అగ్ర బ్యాంకుల‌ ర్యాంకింగ్‌లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఐసీఐసీఐ 2 స్థానాలు మెరుగుప‌డింది. 2021 మొద‌టి త్రైమాసికంలో రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌లో నిలిచింది. ఆస్తి ప‌రిమాణం ప‌రంగా భార‌త‌దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌, 2021 మొద‌టి త్రైమాసికంలో 7వ స్థానంలో ఉంది. గ‌త సంవ‌త్స‌రం కూడా ఇదే స్థానంలో ఉంది.


Updated Date - 2021-04-09T19:23:04+05:30 IST