రోజుకు 20 లక్షల కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం: ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2021-05-12T01:25:55+05:30 IST

దేశవ్యాప్తంగా రోజుకు 18 నుంచి 20 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్

రోజుకు 20 లక్షల కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజుకు 18 నుంచి 20 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. లేబొరేటరీ సిబ్బంది కరోనా బారినపడుతున్నప్పటికీ పరీక్షలు మాత్రం అదే స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు దాదాపు 21 శాతం ఉండగా, 42 శాతం (310/734) జిల్లాలు జాతీయ సగటు కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు కలిగి ఉన్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. 


మన లేబొరేటరీలకు రోజుకు 16 లక్షల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే సామర్యం మాత్రమే ఉందని, 17 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు (ఆర్ఏటీ) చేసే సామర్థ్యం ఉందని భార్గవ పేర్కొన్నారు. టెస్టింగ్ డిమాండ్‌ను తీర్చేందుకు లేబొరేటరీలు 24 గంటలు పనిచేస్తున్నాయన్నారు. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 16 నుంచి 20 లక్షల ఆర్ఏటీ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏప్రిల్ 30న 19,45,299 పరీక్షలు నిర్వహించామని, అమెరికా కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ చేయలేదని చెప్పారు. ఈ నెల 5న 19,23,131 పరీక్షలు చేసినట్టు వివరించారు.

Updated Date - 2021-05-12T01:25:55+05:30 IST