60% మందిలో యాంటీ బాడీలు

ABN , First Publish Date - 2021-07-23T23:58:48+05:30 IST

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఎన్ఐఎన్ ప్రకటించింది. జనగామ,

60% మందిలో యాంటీ బాడీలు

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఎన్ఐఎన్ ప్రకటించింది. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ ఇటీవల సీరో సర్వే చేసింది. 60% మందిలో కొవిడ్ యాంటీ బాడీలు గుర్తించినట్టు ప్రకటించింది. చిన్నారుల్లో 55%, పెద్దవారిలో 61 % మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు ఎన్ఐఎన్ తెలిపింది. హెల్త్‌కేర్ వర్కర్‌లలో 82.4% మందిలో కొవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.




ఆయా జిల్లాల్లో గతంలో మూడుసార్లు సీరో సర్వే నిర్వహించింది. మొదటిసారి కేవలం 0.33%, రెండోసారి 12.5%, మూడోసారి 24.1 % మందిలో యాంటీ బాడీల గుర్తించామని సంస్థ పేర్కొంది. జాతీయ స్థాయిలో డిసెంబర్ 2020 లో 24% మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించగా ప్రస్తుతం అది 67% కి చేరిందని ఎన్ఐఎన్ తెలిపింది. వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న వారిలో 94% సీరో పాజిటివిటీ రేట్ గుర్తించినట్టు ఎన్ఐఎన్ ప్రకటంచింది. 

Updated Date - 2021-07-23T23:58:48+05:30 IST