Abn logo
Jul 10 2020 @ 01:47AM

నేడు ఐసీఎస్‌ఈ ఫలితాల విడుదల

న్యూఢిల్లీ, జూలై 9:  ఐసీఎస్‌ఈ 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు  విడుదల కానున్నాయి. ఈ మేరకు కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌(సీఐసీఎస్‌ఈ) కార్యదర్శి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను బోర్డు వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు. అలాగే ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. కాగా, 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలను ఈనెల 11 నుంచి 13 వరకు విడుదల చేయనున్నట్లు సాంఘిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తను సీబీఎస్‌ఈ ఖండించింది. ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని  పేర్కొంది.


Advertisement
Advertisement
Advertisement