Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

నాడు-నేడు పనుల్లో అవినీతి ఆరోపణలు 

ఆకస్మిక తనిఖీలో ఆర్‌జేడీ, డీఈఓ

ఖాజీపేట, డిసెంబరు 7: నాడు-నేడు పనుల్లో అవకతవకలు జరిగినట్లు విచారణ కమిటీ నివేదికపై ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబును సస్పెండ్‌ చేశామని ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు. నాడు-నేడు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో పేరారెడ్డికొట్టాల సమీప ఆదర్శపాఠశాలను మంగళవారం రాత్రి డీఈఓ శైలజతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్‌పై పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టామన్నారు. విద్యార్థినులను హాస్టల్‌ నుంచి ఇంటికి పంపించడం సబబుకాదన్నారు. విద్యార్థులకు భోజన వసతిని పరిశీలించి అక్కడే భోజనం చేశారు. 

Advertisement
Advertisement