Abn logo
May 20 2020 @ 04:41AM

ఆదర్శంగా నిలిచిన వలంటీర్లు

పోలీస్‌ కమిషనర్‌ వీబీకమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌ క్రైం, మే 19: పోలీసులకు తమవంతు సహకారంగా ముందుకువచ్చి స్వచ్ఛందంగా సేవలందించిన వలంటీర్లు ఆదర్శంగా నిలుస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ వీబీకమలాసన్‌రెడ్డి అన్నారు. తమలో దాగి ఉన్న సేవాగుణాన్ని నిరూపించుకునేందుకు లభించిన అవకాశాన్ని వలంటీర్లు సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. వలంటీర్లకు పోలీసు శాఖ తరపున మంగళవారం ప్రశంసాపత్రాలను అందించారు.


కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పరమిత సంఖ్యలోనే వలంటీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చురుకైన వలంటీర్ల సేవలను భవిష్యత్తులో వినియోగించుకుంటామన్నారు. పీస్‌అండ్‌వెల్ఫేర్‌ కమిటీలో అవకాశం కల్పిస్తామన్నారు. పోలీసుకళాబృందం ఇన్‌చార్జి రామంచతిరుపతి ఆల పించిన పాటలు, నాటికలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement
Advertisement