ఉపగ్రహ సాయంతో ఈశాన్య సరిహద్దుల గుర్తింపు!

ABN , First Publish Date - 2021-08-02T07:15:38+05:30 IST

ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణకు ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. శాటిలైౖట్‌ ఇమేజింగ్‌ ద్వారా బోర్డర్లను గుర్తించనుంది.

ఉపగ్రహ సాయంతో ఈశాన్య సరిహద్దుల గుర్తింపు!

న్యూఢిల్లీ/ఐజ్వాల్‌/గువాహటి, ఆగస్టు 1: ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణకు ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. శాటిలైౖట్‌ ఇమేజింగ్‌ ద్వారా బోర్డర్లను గుర్తించనుంది. అసోం-మిజోరం సరిహద్దు గొడవ హింసాత్మకంగా మారి గత నెల 26న మిజో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసు లు, ఒక పౌరుడు మరణించగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపే యోచన లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఉభయ రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, జోరాంథంగాలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం ఫోన్‌లో చర్చలు జరిపారు. సరిహద్దు సమస్యకు సంప్రదింపుల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించామని జోరాంథంగా ట్విటర్‌లో తెలిపారు.

Updated Date - 2021-08-02T07:15:38+05:30 IST