స్పోర్ట్స్‌ కోడ్‌కు కట్టుబడితేనే..

ABN , First Publish Date - 2020-07-04T08:35:56+05:30 IST

జాతీయ క్రీడా సంఘాల వార్షిక గుర్తింపు కొనసాగాలంటే స్పోర్ట్స్‌కోడ్‌ను పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. స్పోర్ట్స్‌ కోడ్‌కు..

స్పోర్ట్స్‌ కోడ్‌కు కట్టుబడితేనే..

క్రీడా సంఘాల గుర్తింపుపై ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ:  జాతీయ క్రీడా సంఘాల వార్షిక గుర్తింపు కొనసాగాలంటే స్పోర్ట్స్‌కోడ్‌ను పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. స్పోర్ట్స్‌ కోడ్‌కు కట్టుబడని క్రీడా సమాఖ్యలకు తాత్కాలిక గుర్తింపు కింద ఈ ఏడాది ఎలా రెన్యువల్‌ చేస్తారని జస్టిస్‌ హిమా కోహ్లీ, నజిమి వాజ్రితో కూడిన బెంచ్‌ కేంద్ర క్రీడాశాఖను పశ్నించింది. తొలుత సంఘాలు తమ పనితీరును చక్కదిద్దుకోవాలని సూచించింది. అయితే, వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు క్రీడా సమాఖ్యలు పనిచేయాల్సి ఉన్నందున ఈ 57 (కొత్తగా చేర్చిన 3 సంఘాలతో కలిపి) సంఘాలకు తాత్కాలిక గుర్తింపునివ్వాలని కోరుతూ కేంద్ర క్రీడా శాఖ మూడు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. దీనికి కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా 54 క్రీడా సమాఖ్యలకు గుర్తింపునిచ్చే విషయంలో తమ అనుమతి లేకుండా ఎటువంటి నిర్ణయమూ తీసుకోవద్దని హైకోర్టు గతనెల 26న క్రీడాశాఖను ఆదేశించింది.

Updated Date - 2020-07-04T08:35:56+05:30 IST