బలగతో జిల్లాకు గుర్తింపు

ABN , First Publish Date - 2020-02-23T07:36:01+05:30 IST

చిన్నవయసులోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఎచీవర్స్‌ అవార్డును పొందిన బలగ ప్రకాష్‌తో జిల్లాకు మరింత గుర్తింపు వచ్చిందని కేంద్ర మాజీమంత్రి కిల్లి

బలగతో జిల్లాకు గుర్తింపు

ఇండియన్‌ ఎచీవర్స్‌ అవార్డును పొందడం అభిందనీయం

కేంద్ర మాజీ మంత్రి  కృపారాణి

జాతీయ అవార్డుగ్రహీత ప్రకాష్‌కు ఘన సన్మానం  


బడగాం(నందిగాం), ఫిబ్రవరి 22:  చిన్నవయసులోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఎచీవర్స్‌ అవార్డును పొందిన బలగ ప్రకాష్‌తో జిల్లాకు మరింత గుర్తింపు వచ్చిందని కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. 2019 ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తగా జాతీయ అవార్డు పొందిన ప్రకాష్‌ను శనివారం రాత్రి తన స్వగ్రామం బడగాంలో ఘనంగా సన్మానించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృపారాణి హాజరై మాట్లాడారు.  ప్రకాష్‌ సినీ నిర్మాతగా, యువ పారిశ్రామికవేత్తగా పలు రంగాల్లో రాణి స్తూ జిల్లాకు, స్వగ్రామానికి పేరు తీసుకువ చ్చారన్నారు. ఆయన జాతీయ పురస్కారం పొందడం అభినందనీయమన్నారు. ఈ గౌర వాన్ని ప్రకాష్‌ నిలబెట్టుకొని రానున్న కాలంలో మరిన్ని పురస్కారాలు పొందాలని ఆమె ఆకాంక్షించారు. 


వైసీపీ టెక్కలి సమన్వయకర్త  పేరాడ తిలక్‌  మాట్లాడుతూ, ప్రకాష్‌ ప్రతిష్టా త్మక అవార్డు పొందడం ద్వారా నందిగాం మం డలానికి జాతీయస్థాయిలో పేరు వచ్చింద న్నారు. అనంతరం ప్రకాష్‌, విజయలక్ష్మి దంప తులను కృపారాణి, తిలక్‌, తదితరులు  పూల మాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ, అందరి ప్రోత్సాహంతోనే తనకు జాతీయ పురస్కారం లభించిందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె.బాలకృష్ణారావు, మాజీ ఎంపీపీలు యర్ర విశ్వశాంతి, చింతాడ మంజుగణపతి, నాయకు లు ఎన్‌.శ్రీరామ్మూర్తి, కె.నారాయణ మూర్తి, ఎం.సంజీవరావు, ఎస్‌.బైరాగి, కె.శేషగిరి, బి.భీ మారావు, ఎస్‌.కలవయ్య, జె.జయరాం, కె.బా బూరావు, మాజీసర్పంచ్‌లు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T07:36:01+05:30 IST