Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమర్థవంతమైన బాధ్యతలతో గుర్తింపు

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 30: వర్టికల్‌ పద్ధతిలో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన వారికి గుర్తింపు ఉంటుందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర స్థాయిలో జిల్లాల ఎస్పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ రాజేష్‌చంద్ర పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పెండింగ్‌ కేసుల ప్రస్థుత స్థితిగతుల పై ఆరాతీయడంతో పాటు నేర నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు, వర్టికల్‌ పనితీరుపై డీజీపీ ఎస్పీని వివరణ కొరారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణలో భాగంగా గతంలో నేరాలకు పాల్పడిన నేరస్థులపై నిఘా పెట్టడంతో పాటు నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోగంజాయి, పొగాకు ఉత్పత్తులతో పాటు మత్తు పదార్థాల రవాణాకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి రవాణా వ్యవస్థను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, కార్యాలయ పరిపాలన అధికారి మహ్మద్‌యూనిస్‌ఆలీ, గ్రామీణ సీఐ పురుషోత్తంచారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement