విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-09-06T06:29:15+05:30 IST

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా గుర్తించి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సూచిం చారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించాలి
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 5: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా గుర్తించి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సూచిం చారు. సోమవారం స్థానిక అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్స వంలో కలెక్టర్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందన్నారు. పిల్లలలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే ఉపాధ్యా యులకు సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుం దని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధ్యాయులకు మంచి ప్రతిభతో విద్యార్థులకు సేవలు అందిస్తున్నార న్నారు. కరోనా అనంతరం 10వ తరగతి విద్యార్థుల కోసం జిల్లాలో ప్రత్యేకంగా ఆల్‌ ఇన్‌వన్‌ బుక్‌లెట్‌ తయారు చేశామని దీని కోసం సహకరించిన సంచార ప్రయోగశాల ఏర్పాటులో విశేషంగా కృషిచేసిన  ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, డీఈవోలు ప్రశంసాప త్రాలు, మెమొంటోలు అందించి శాలువాలతో సన్మానిం చారు. అంతకుముందు సుల్తానాబాద్‌ మండలం కదంబాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు గాయత్రి స్వాగత నృత్యం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి హన్మంతు, ఏసీజీఈ రాంరెడ్డి, సురేందర్‌, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు విజయకుమార్‌, శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి రవినందన్‌రావు, నరేష్‌, మండల విద్యాధికారులు, పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-06T06:29:15+05:30 IST