కరోనా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే...

ABN , First Publish Date - 2021-05-05T00:50:50+05:30 IST

కరోనా నేపధ్యంలో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత పెరిగింది. కాగా... సాధారణ ఆరోగ్య బీమాతో పాటు కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలు వచ్చాయి.

కరోనా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే...

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత పెరిగింది. కాగా... సాధారణ ఆరోగ్య బీమాతో పాటు కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలు వచ్చాయి. ఈ పాలసీ తీసుకుంటే... కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకినపక్షంలో... బీమా సంస్థను సంప్రదించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ పరిష్కరించుకోవచ్చు. బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏ) ప్రకారం ఇన్సురెన్స్ కంపెనీలు తక్కువ కాలంలోనే పాలసీలను పరిష్కరిస్తున్నాయి. 


అప్పుడే క్లెయిమ్స్ పరిష్కారం... కరోనాకు సంబంధించి ఏదైనా లక్షణాన్ని గుర్తిస్తే మొదట ప్రభుత్వ అధీకృత టెస్టింగ్ సెంటర్‌లో పరీక్షలు చేయించుకోవాలి.. క్లెయిమ్స్ సెటిల్మెంట్ సమయంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి  పాలసీదారుడు తీసుకుంటున్న చికిత్స, హోమ్ కేర్, క్వారంటైన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని బీమా సంస్థకు వెల్లడించాలి. ఇలా చేస్తేనే... పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం ఆయా క్లెయిమ్స్‌ను బీమా సంస్థ అంచనా వేసి, దాని ప్రకారం పరిష్కరిస్తుంది. 


ఐసీఎంఆర్ మార్గదర్శకాలు...

శ్వాసకోశ వ్యవస్థలో కరోనా ఉనికిని నిర్ధారించేందుకు ఐసీఎంఆర్ ఆమోదించిన, ప్రభుత్వ లాబొరేటరీలు, ప్రైవేటు లాబొరేటరీలు ఉన్నాయి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన వైద్యుల సూచనల మేరకు మాత్రమే ప్రైవేటు ల్యాబ్స్ పరీక్షిస్తాయి. క్లెయిమ్స్ కోసం దాఖలు చేస్తే ప్రభుత్వ అధీకృత పరీక్షా కేంద్రం నుండి పొందిన పరీక్ష నివేదికను, దీంతో పాటు అర్హత కలిగిన డాక్టర్ పరీక్ష కోసం సిఫార్సు చేసిన ప్రిస్కిప్షన్‌ను దరఖాస్తుతో పాటు అందించాలి.


ముందే పత్రాల సమర్పణ...

ఆసుపత్రిలో చేరేముందు, తర్వాత అయిన ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, కరోనాకు సంబంధించిన చికిత్స ఖర్చులు పాలసీలో కవర్ అవుతాయి. కరోనా కేసుతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినపక్షంలో... ముందే బీమా సంస్థకు తెలియజేసి ఆమోదం పొందడం మంచిది. 


Updated Date - 2021-05-05T00:50:50+05:30 IST