Abn logo
Nov 17 2020 @ 16:26PM

రుణం కోసం... ఒకేసారి ఎక్కువ బ్యాంకుల్లో.. దరఖాస్తు చేసుకుంటే...

Kaakateeya

ముంబై : రుణం కోసం ఒకేసారి వివిధ బ్యాంకులకు దరఖాస్తులు చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాలా చేస్తే... లోన్ రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 చాలా మంది లోన్ కోసం ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఒక బ్యాంక్‌లోరాకపోయినా మరో బ్యాంక్‌లో రుణం పొందవచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు. అంతేకాకుండా అప్లై చేసిన తర్వాత ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకి లోన్ వస్తుందో చూసుకోవచ్చన్న ఉద్దేశం కూడా ఉంటుంది. కానీ... ఇలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు లోన్ కోసం అప్లై చేసుకున్న ప్రతీసారి లోన్ ఎంక్వైరీ జనరేట్ అవుతూ వస్తూంటుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడే ప్రమాదముంటుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి...

లోన్ కోసం అప్లై చేసుకున్న వెంటనే బ్యాంక్... మన  క్రెడిట్ స్కోర్ చూస్తుంది. ఇలా ఎన్ని బ్యాంకులకు అప్లై చేసుకుంటే అన్ని బ్యాంకులూ మీ సిబిల్ స్కోర్‌ను తీసుకుంటాయి. ఇందులో మీరు ఎన్ని సార్లు ఏ ఏ బ్యాంక్‌కు లోన్ కోసం అప్లై చేశారన్న వివరాలుంటాయి. ఒకవేళ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైతే... అప్పుడు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుది. అంటే క్రెడిట్ స్కోరు తగ్గుతుందన్న మాట. 


ఈ క్రమంలో... ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందకపోవచ్చు. అయితే... రుణం కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకుంటే... క్రెడిట్ స్కోర్ జీరో అని చూపిస్తుంది. ఇలాంటప్పుడు కూడా లోన్ పొందటం కష్టమవుతుంది. ఈ క్రమంలో... రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందే ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే రుణం అందుబాటులో ఉందో ‘ఆన్‌లైన్‌’లో తెలుసుకోవడం బెటర్. 

Advertisement
Advertisement