పిల్లలు మెరికల్లా మారాలంటే..

ABN , First Publish Date - 2022-07-28T05:41:06+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా పిల్లల మీద చేపట్టిన పరిశోధనల్లో మూడేళ్ల వయసుకే 88-98% పదజాలాన్ని వాళ్ల తల్లితండ్రుల నుంచే నేర్చుకుంటున్నారని తేలింది.

పిల్లలు మెరికల్లా మారాలంటే..

పిల్లల్లో దాగి ఉండే ఎమోషనల్‌, సోషల్‌, ఇంటలెక్చువల్‌ స్కిల్స్‌ శరీర కండరాల్లాంటివి. వాటికి వ్యాయామ్నా నందించి శక్తివంతంగా మార్చాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. 


మాట్లాడాలి: ప్రపంచ వ్యాప్తంగా పిల్లల మీద చేపట్టిన పరిశోధనల్లో మూడేళ్ల వయసుకే 88-98% పదజాలాన్ని వాళ్ల తల్లితండ్రుల నుంచే నేర్చుకుంటున్నారని తేలింది. అంటే మనం పిల్లలతో ఎంత ఎక్కువగా మాట్లాడితే వాళ్ల భావ వ్యక్తీకరణ, సంభాషించే నైపుణ్యాలు అంతలా పెరుగుతాయి. కాబట్టి పిల్లలతో వీలైనంత ఎక్కువ మాట్లాడాలి.

 

ఆటలాడనివ్వాలి: ఫిన్‌ల్యాండ్‌లోని స్కూళ్లలో ప్రతి 45 నిమిషాల క్లాసు తర్వాత 15 నిమిషాల బ్రేక్‌ ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు వాళ్లకిష్టమైన ఆటలు ఆడతారు. దీనివల్ల పిల్లల్లో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, రీజనింగ్‌, మెమరీ మొదలైన ఎగ్జిక్యూటివ్‌ ఫంక్షనల్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. కాబట్టి పిల్లలను ఆటలవకు వదలాలి. 

Updated Date - 2022-07-28T05:41:06+05:30 IST