Abn logo
Aug 2 2021 @ 00:51AM

పరిహారం ఇవ్వకుంటే వైసీపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తాం : బీజేపీ

మాట్లాడుతున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌

కూడేరు, ఆగస్టు 1 : భూములిచ్చిన రైతులకు వెంటనే పరిహారం ఇ వ్వాలని, లేనిపక్షంలో వైసీపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ జి ల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవా కాలువ నుంచి ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు వదిలేందుకు అవసరమైన భూముల ను రైతుల నుంచి సేకరించారన్నారు. అయితే అన్నదాతలకు పరిహారం అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పరిహారం అందించకుంటే వైసీపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.   నాలుగేళ్లుగా పరిహారం అందకపోవడంతో రైతులు కాలువను పూడ్చే ప్ర యత్నం చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణం పరిహారం అందించాలని డి మాండ్‌ చేశారు.

           చెరువులకు నీరు వదిలే సమయంలో మూడు నెలల్లో ప రిహారం అందిస్తామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చి నాలుగు నెలలవుతు న్నా... పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఇంతవరకూ పరిహారం రాకపోయినా వైసీపీ నాయకులు మాత్రం ఆర్భాటంగా గంగపూజ, వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు ఇలాం టి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది కోట్ల నిధులు వచ్చాయని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఇంతవరకూ అన్నదాతలకు ఎందుకు పరిహారం చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. హంద్రీనీవా కాలు వ నుంచి ఇప్పేరు చెరువు వరకూ పలు గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో పె ద్దఎత్తున రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలతో కలిసి పాదయాత్ర చే స్తూ ప్రభుత్వ తీరును ఎండగడతామని పేర్కొన్నారు. సమావేశంలో నా యకులు సురేష్‌, మల్లికార్జున, రాము, పవన్‌, సందీప్‌, శివ పాల్గొన్నారు.