డిట్ కార్డు బిల్లు టైమ్‌కు కట్టకపోతే... ఐదు రకాలుగా నష్టం...

ABN , First Publish Date - 2020-11-17T20:20:19+05:30 IST

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యం జరిగితే... చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎటువంటి రుణాన్నీ పొందేందుకు అవకాశముండబోదు.

డిట్ కార్డు బిల్లు టైమ్‌కు కట్టకపోతే... ఐదు రకాలుగా నష్టం...

ముంబై : క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యం జరిగితే... చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎటువంటి రుణాన్నీ పొందేందుకు అవకాశముండబోదు. 

క్రెడిట్ కార్డులతో ఎన్ని ప్రయోజనాలుంటాయో, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే అన్ని దుష్పరిణామాలూ ఉంటాయి. చెల్లింపులు సక్రమంగా ఉన్నపక్షంలో... రివార్డు పాయింట్లు, నో కాస్ట్ ఈఎంఐ, రాయితీలు, క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ క్రెడిట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఇక క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా వాడితే... రుణఊబిలో కూరుకుపోతాం. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే బ్యాంకుల నుంచి రుణాలు పొందలేం. అందుకే క్రెడిట్ కార్డును ఎలా వాడినా కూడా బిల్లు మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తూ వస్తే నష్టం జరగదు. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.


ఇక... క్రెడిట్ కార్డు బిల్లులను కరెక్ట్‌ టైమ్‌కు చెల్లించనిపక్షంలో ఆలస్య రుసుమును చెల్లించుకోవాలన్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే...  కార్డు తర్వాతి స్టేట్‌మెంట్‌కు జతకూడుతుంది. అంతేకాదు... చెల్లించని డబ్బులపై అధిక వడ్డీ పడుతుంది. ఇక క్రెడిట్( సిబిల్) స్కోర్ కూడా దెబ్బతింటుంది. మరోవైపు రివార్డులను కూడా కోల్పోవలసి ఉంటుంది. 


క్రెడిట్ కార్డును బిల్లును చాలా రోజులపాటు కట్టనిపక్షంలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కార్డు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోవడం 180 రోజులు దాటితే కార్డును బ్లాక్ చేస్తారన్న విషయం తెలిసిందే. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ బాగోలేకపోతే భవిష్యత్తులో ఎలాంటి రుణాలను పొందేందుకు అవకాశాలుండవు. 

Updated Date - 2020-11-17T20:20:19+05:30 IST