ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్స్‌కు కాల్ చేస్తే...

ABN , First Publish Date - 2021-01-17T23:29:18+05:30 IST

ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్స్‌కు కాల్ చేసినపక్షంలో... ముందుగా ‘0’ నొక్కాలని వినియోగదారులకు టెలికం కంపెనీలు సూచించాయి. ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఈ మేరకు సందేశాలను పంపాయి.

ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్స్‌కు కాల్ చేస్తే...

హైదరాబాద్ : ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్స్‌కు కాల్ చేసినపక్షంలో... ముందుగా ‘0’ నొక్కాలని వినియోగదారులకు టెలికం కంపెనీలు సూచించాయి.  ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఈ మేరకు సందేశాలను పంపాయి. గతేడాది నవంబరులో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు... ఈ(2021) ఏడాది జనవరి 15 నుంచి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి. ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పూ లేదు.

Updated Date - 2021-01-17T23:29:18+05:30 IST