విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే.. ఆందోళనే..: గురునాథ్ రావు

ABN , First Publish Date - 2021-09-11T23:04:01+05:30 IST

జంగారెడ్డిగూడెం: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని.. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథ్ రావు హెచ్చరించారు. శనివారం కాంగ్రెస్ ఏలూరు

విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే.. ఆందోళనే..: గురునాథ్ రావు

జంగారెడ్డిగూడెం:  పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని.. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథ్ రావు హెచ్చరించారు. శనివారం కాంగ్రెస్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని కార్యాలయం వద్ద అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథ్ రావు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని పాదయాత్ర సమయంలో.. ప్రజలను జగన్ నమ్మబలికాడని చెప్పారు. అధికారంలోకి రాగానే.. చంద్రబాబు బాటలోనే నడుస్తూ విద్యుత్ చార్జీలు పెంచి, సుమారు రూ.3,669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు.


అధిక పన్నులు ఉండవని అప్పట్లో నమ్మించి.. ప్రస్తుతం ప్రతి వస్తువుపై పన్నులు పెంచుతున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. పీసీసీ పిలుపు మేరకు.. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఈనెల 13న ఏలూరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు గురునాథ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏలూరు జిల్లా కమిటీ, ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, ముప్పిడి శ్రీనివాసరావు, శీలం రాజు,  నులకాన్ని నాగబాబు, ఏలూరు పని కుమార్, తాడేపల్లి ఉమాదేవి మొగలి నీడి శ్యాం,  జమీరు, వసంటటి మంగారాజు, అడవి కొట్టు రవి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-11T23:04:01+05:30 IST