Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోమ్‌లోన్ తీసుకున్నవారు చనిపోతే...

హైదరాబాద్ : హోంలోన్ తీసుకున్నవారు...  మధ్యలోనే మరణిస్తే... ఈఎంఐల రూపంలో వారు చెల్లించిన మొత్తం మరణం తర్వాత లెక్కించరా? ఉమ్మడిగా యాజమాన్యపు హక్కు ఉన్న వారు ఆస్తి హక్కును కోల్పోతారా ? వంటి ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. అయితే ఇవన్నీ అపోహలే.


హోంలోన్‌ల విషయంలో చాలా మందిలో ఉండే ప్రధానమైన అపోహ... సదరు ఆస్తిని బ్యాంకులు స్వాధీనపరుచుకుంటాయని భావించడం. కానీ వాస్తవానికి... బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వారిచ్చిన రుణాలపై వచ్చే వడ్డీని లాభంగా పొందాలనే చూస్తాయి. అందుకే రుణగ్రస్తునికి... రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా ? లేదా ? అనే ముందుగానే ఆలోచిస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లోనూ ఈ విషయమే ఉంటుంది. చాలావరకు బ్యాంకులు... లోన్ తిరిగి చెల్లించాలనే భావిస్తాయి. ఆస్తిని స్వాధీనపరచుకోవడమన్నది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.


వేలం వేయడం ద్వారా ఆస్తిని విక్రయించడం వల్ల నష్టాలను పూరించలేవడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఇందుకు... విజయ్ మాల్యా, సుబ్రోతో రాయ్ సహారా తదితరులకు సంబంధించిన సంఘటనలను చెప్పుకోవచ్చు. ఆస్తులు వేలం వేయడం, స్వాధీనపరచుకోవడం బ్యాంకులకు పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎలాంటి ఆప్షన్లు లేని సందర్భాల్లో మాత్రమే ఈ ఈ విధానాన్ని ఎంచుకుంటాయి.


ఆస్తి బీమా ద్వారా ఉపశమనం పొందవచ్చు... 

రుణం నుంచి రక్షణ పొందాలంటే హోం లోన్ ఇన్సురెన్స్, ప్రాపర్టీ ఇన్సురెన్స్ అని రెండు రకాల బీమాలుంటాయి. ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు... రుణగ్రహీతలకు ఇవి మీకు రక్షణ కల్పిస్తాయి. కాలపరిమితి మధ్యలోనే రుణగ్రస్తుడు దురదృష్టవశాత్తూ మరణించినపక్షంలో...  హోం లోన్ ఇన్సురెన్స్ ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ ఇన్సురెన్స్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Advertisement
Advertisement