మార్కెట్ క్రాష్ అవుతుంటే... ఈ పొరపాట్లు చేయొద్దు...

ABN , First Publish Date - 2021-05-04T01:35:30+05:30 IST

కరోునా సెకండ్ వేవ్ విజృభిస్తోన్న నేపధ్యంలో... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ దిగజారుతోంది.

మార్కెట్ క్రాష్ అవుతుంటే... ఈ పొరపాట్లు చేయొద్దు...

ముంబై : కరోునా సెకండ్ వేవ్ విజృభిస్తోన్న నేపధ్యంలో... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ దిగజారుతోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి 4 శాతం క్షీణించింది. గతేడాది కూడా ఇలాంటి క్షీణతే నమోదు కావడంతో మదుపర్ల జేబులు ఖాళీ కాకుండా నిపుణులు పలుహెచ్చరికలు చేస్తున్నారు. ప్రత్యేకించి... ఈ సమయంలో ఆయా తప్పిదాలు అస్సలు చేయొద్దంటూ పెట్టుబడుదారులకు సూచిస్తున్నారు. 


ఈక్వీటీల నుంచి ఎగ్జిట్ కావద్దు...

మార్కెట్ క్రాష్ అవ్వగానే చాలా మంది తమ ఈక్విటీ పెట్టుబడులను విక్రయిస్తుండడం పరిపాటి. అలా చేయడం సమంజసం కాదని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో కోవిడ్ తీవ్రత నేపధ్యంలో సెన్సెక్స్ 30 శాతం క్రాష్ కావడంతో పెట్టుబడిదారులు పెద్దసంఖ్యలో ఇలాగే చేశారు. ఫలితంగా... కొద్దికాలంలోనే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెన్సెక్స్ రెండు రెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణం.


మార్కెట్లు క్రాష్ అయినప్పుడు బెంబేతెత్తిపోవద్దన్నది నిపుణుల సలహా. ఏదేమైనా ఈక్విటీల నుంచి నిష్క్రమించడం దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎదురుదెబ్బేనన్నది నిర్వివాదాంశమని నిపుణుల అభిప్రాయం. దీర్ఘకాలిక పెట్టుబడుదారులైతే ప్రతి రోజూ మార్కెట్ గురించి పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. 

Updated Date - 2021-05-04T01:35:30+05:30 IST