అనుమతిస్తే... రూ. 2,500 కే ఆక్సి డివైజ్... హైదరాబాద్ కుర్రాడి ఘనత...

ABN , First Publish Date - 2021-05-05T02:02:34+05:30 IST

కరోనా నేపధ్యంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆక్సిజన్ కిట్లను అతి తక్కువ ధరకే తయారు చేసాడు ఓ హైదరాబాద్ కుర్రాడు.

అనుమతిస్తే... రూ. 2,500 కే ఆక్సి డివైజ్...  హైదరాబాద్ కుర్రాడి ఘనత...

హైదరాబాద్ : కరోనా నేపధ్యంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆక్సిజన్ కిట్లను అతి తక్కువ ధరకే తయారు చేసాడు ఓ హైదరాబాద్  కుర్రాడు. అనుమతులు రాగానే వెంటనే మార్కెట్‌లోకి విడుదల చేస్తామని చెబుతున్నాడు. 


కరోనా నేపధ్యంలో ఆక్సిజన్ కు ఎంత డిమాండ్ ఉందో తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో... హైద‌రాబాద్‌కు చెందిన ఓ కుర్రాడి ప్రయ‌త్నం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇంట్లోనే ఆక్సిజ‌న్ అందించ‌డం ఈ కుర్రాడు రూపొందించిన డివైజ్ ప్ర‌త్యేకత‌. హైద‌రాబాద్ లోని క‌వాడీగూడ‌కు చెందిన ప్ర‌వీణ్ ఈ డివైజ్ ను త‌యారుచేశాడు. కేవ‌లం 72 గంట‌ల్లోనే రూపొందించిన ఈ డివైజ్‌కు ఇప్పుడు స‌ర్వ‌త్రా ప్రశంసలందున్నాయి. కేవ‌లం ఒక ప్లాస్టిక్ డ‌బ్బాతో రూపొందించిన ఈ డివైజ్ ఇంట్లోనే ఇద్దరు వ్యక్తులకు దాదాపు పన్నెండు గంట‌లపాటు ఆక్సిజ‌న్ అందిచ‌గ‌ల‌దు.


‘ద ఫై ప్యాక్టరి’ పేరుతో ఓ సంస్థ‌ను స్థాపించి ఈ ఆక్సిజ‌న్ డివైజ్ లు రూపొందిస్తన్నాడు ప్ర‌వీణ్. కేవ‌లం రూ. 2,500 లతో తయారుచేసిన ఈ డివైజ్ ఇంట్లో ఉంటే ఇక ఆక్సిజ‌న్ కోసం తిప్ప‌లు అవ‌స‌రం లేదంటున్నాడు ప్రవీణ్. ‘వాయు పాత్ర’ పేరుతో దీనిని వ్యవహరిస్తున్నట్లు తెలిపాడు. ప‌నితీరు కూడా చాలా ప్ర‌త్యేకంగానే ఉంటుందని చెబుతున్నాడు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


చిన్న ప్లాస్టిక్ డ‌బ్బాలా ఉండే ఈ డివైజ్ కు రెండు ట్యూబ్ లు అమ‌ర్చ‌డం ద్వార ఇది ప‌ని చేస్తుది. ఈ డివైజ్ ఆన్ చేసిన ప‌ది సెక‌న్లలోనే రోగికి ఆక్సిజ‌న్ అందుతుంది. చూడడానికి చిన్న ‘డబ్బా’లా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికౌనా తేలికగా తీసుకెళ్ళొచ్చు. 


ప్ర‌వీణ్ రూపోందించిన డివైజ్‌కు శాఖ‌ాప‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తామంటున్నాడు ప్ర‌వీణ్. అత్య‌వ‌స‌రంగా ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైన రోగులకు తన ఈ కిట్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుందని చెబుతున్నాడు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంబులెన్స్ వ‌చ్చేలోగా ఈ కిట్ సాయంతో ఆక్సిజ‌న్‌ను బాధితునికి అందించవచ్చు. ఈ కిట్ల తయారీకోసం జీడిమెట్ల లో రోజుకి దాదాపు మూడు వేల యూనిట్ల తయారీ సామ‌ర్థ్యమున్న ప్లాంట్ కూడా ఏర్పాటుకానున్నట్లు ప్రవీణ్ వెల్లడించాడు. 

Updated Date - 2021-05-05T02:02:34+05:30 IST