Abn logo
Sep 24 2021 @ 01:19AM

గర్భిణీలు వ్యాక్సిన్‌ తీసుకుంటే.. గర్భస్థ శిశువుకు ప్రతిరక్షకాలు!

  • గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకుంటే
  • గర్భస్థ శిశువులకు భారీగా యాంటీబాడీలు
  • టీకా సురక్షితమేనని తేల్చిన తాజా అధ్యయనం


వాషింగ్టన్‌, సెప్టెంబరు 23: టీకా తీసుకున్న గర్భిణిలు తమ గర్భస్థ శిశువులకు అత్యధిక స్థాయిలో ప్రతిరక్షకాలను అందిస్తున్నారని ఓ అధ్యయనం తేల్చింది. గర్భిణిలు ధైర్యంగా టీకా తీసుకోవచ్చని, ఇది వారి శిశువులకు మేలు చేస్తుందని తెలిపింది. బుధవారం అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ గైనకాలజీ మెటెర్నల్‌ ఫెటల్‌ మెడిసిన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. పరిశోధకులు 36 మంది నవజాత శిశువుల బొడ్డు తాడును పరీక్షించగా, అందరిలోనూ ప్రతిరక్షకాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ఇవి తల్లులు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లే వచ్చాయని తేలింది. ఈ అధ్యయనానికి తీసుకున్న శాంపిల్స్‌ తక్కువే అయినప్పటికీ.. నూరు శాతం సానుకూల ఫలితం రావడం గుర్తించాల్సిన అంశమని పరిశోధకులు చెబుతున్నారు.   టీకా సురక్షితమే అని తెలిసినప్పటికీ.. గర్భిణులు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారని, ఇకనైనా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.


తాజా వార్తలుమరిన్ని...