రాకేష్‌ ముట్టుకుంటే బంగారమే

ABN , First Publish Date - 2021-10-15T23:28:28+05:30 IST

రెండు నెలలక్రితం(జులై)నాటి సంగతిది, జొమాటో లిస్టింగ్‌ను దలాల్‌ స్ట్రీట్‌ హైప్‌ చేసి, మొత్తం మార్కెట్‌ దృష్టి దానిపైనే ఉన్న సమయంలో... ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఒక మాట చెప్పారు.

రాకేష్‌ ముట్టుకుంటే బంగారమే

ముంబై : రెండు నెలలక్రితం(జులై)నాటి సంగతిది, జొమాటో లిస్టింగ్‌ను దలాల్‌ స్ట్రీట్‌ హైప్‌ చేసి, మొత్తం మార్కెట్‌ దృష్టి దానిపైనే ఉన్న సమయంలో... ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఒక మాట చెప్పారు. ‘జొమాటో కంటే మెటల్స్‌ నుంచే నేను ఎక్కువ ఆదాయం సంపాదించగలను’ అరి. ఇప్పుడా మాట నిజమవుతోంది. నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో) అప్‌డేట్‌ చేసిన సెప్టెంబరు త్రైమాసికం డేటా ప్రకారం, ఆ త్రైమాసికంలో ఝున్‌ఝున్‌వాలా కొద్దిపాటి స్టేక్‌ తీసుకున్నారు. 


నాల్కోలో 25 లక్షల షేర్లు లేదా 1.36 % వాటా ప్రస్తుతం ఈ బిగ్‌బుక్‌కు ఉంది. ఈ మొత్తం స్టేక్‌ను అదే త్రైమాసికంలో కొన్నారా లేదా, అదనంగా చేర్చారా అన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం  బుల్‌ రన్‌లో నాల్కో షేర్లు కూడా విజృంభిస్తున్నాయి. గత ఏడాదిలో, ఈ స్టాక్‌ త్రీ ఫోల్డ్ లేదా 197 % జంప్‌ చేసింది. అనలిస్టులు ఈ ఈ షేర్లను కొనమని సూచిస్తున్నారు. ఒక డేటా వివరాల ప్రకారం... పన్నెండు నెలల్లో ఎనిమిది మంది ఎనలిస్టులు ఇచ్చిన మీడియన్‌ ప్రైస్‌ టార్గెట్‌ రూ. 96.5 కాగా, దీనిలో హై ఎస్టిమేషన్‌ రూ. 117, లో ఎస్టిమేషన్‌ రూ. 37. నాల్కో, అల్యూమినియంను ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ. 


Updated Date - 2021-10-15T23:28:28+05:30 IST