Madhya Pradesh: కొత్త సిలబస్ లో ఖురాన్ చేర్చాలి

ABN , First Publish Date - 2021-09-15T16:36:41+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఖురాన్, ఇతర మతాల పురాణాలను కూడా కొత్త సిలబస్‌లో చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ డిమాండ్ చేశారు....

Madhya Pradesh: కొత్త సిలబస్ లో ఖురాన్ చేర్చాలి

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ డిమాండ్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఖురాన్, ఇతర మతాల పురాణాలను కూడా కొత్త సిలబస్‌లో చేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ డిమాండ్ చేశారు.ఇంజినీరింగ్ పాఠ్యాంశాల్లో మహాభారత్, రామాయణాలను చేరుస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ ఈ డిమాండ్ చేశారు. ‘‘విద్యార్థుల పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం చేర్చాలని ప్రస్థావించారు, కానీ ఖురాన్, బైబిల్, గురు‌గ్రంథ్ సాహిబ్‌లను కూడా చేర్చాలి. భారతదేశం అన్ని మతాలు కలిసిన లౌకిక దేశం. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా ప్రభుత్వ ఉద్ధేశాన్ని స్పష్టం చేస్తుంది’’ అని మసూద్ అన్నారు.


కొత్త విద్యా విధానం 2020 ప్రకారం మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంజినీరింగ్ సిలబస్‌లో రామాయణం, మహాభారత్ రామచరితలను చేర్చనున్నట్లు సెప్టెంబర్ 13 వతేదీన మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్  ప్రకటించారు.‘‘రాముడి పాత్ర, సమకాలీన రచనల గురించి తెలుసుకోవాలనుకునే ఎవరైనా ఇంజినీరింగ్ కోర్సులలో చదువుకోవచ్చు’’ అని యాదవ్ చెప్పారు.నిర్దిష్ట మతం గురించి కాకుండా తాము ఉర్దూ గజల్‌ని కూడా ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టామని మంత్రి యాదవ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రామాయణం లాగే ఖురాన్, ఇతర మత గ్రంథాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎమ్మెల్యే మసూద్ కోరారు.


Updated Date - 2021-09-15T16:36:41+05:30 IST