ఇలా ఉంటే వాహనాలు వెళ్లేదెలా..?

ABN , First Publish Date - 2021-10-28T05:05:26+05:30 IST

మండలంలోని సిరిగేపల్లె గ్రామ శివార్లలో ప్రధాన రోడ్డు మోకాళ్లలోతు గుంతలు పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఇలా ఉంటే వాహనాలు వెళ్లేదెలా..?
సిరిగేపల్లె శివార్లలో ప్రధాన రోడ్డు దుస్థితి

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 27:మండలంలోని సిరిగేపల్లె గ్రామ శివార్లలో ప్రధాన రోడ్డు మోకాళ్లలోతు గుంతలు పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆదారిన వెళ్లే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రాత్రి సమయాల్లో జమ్మలమడుగు మండలం నుంచి ఆర్టీపీపీ ఉద్యోగులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లడానికి ఎప్పుడు  ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి వెం టనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-28T05:05:26+05:30 IST