వ్యాప్తిరేటు ఇలాగే కొనసాగితే

ABN , First Publish Date - 2020-03-26T07:16:43+05:30 IST

భారత్‌లో కరోనా వ్యాప్తిరేటు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగితే మే రెండోవారం కల్లా కేసుల సంఖ్య 13 లక్షలకు చేరే అవకాశముందని శాస్త్రవేత్తలు, డాటా సైంటిస్టులతో కూడిన ఓ

వ్యాప్తిరేటు ఇలాగే కొనసాగితే

 మే రెండోవారానికి 13లక్షల కరోనా కేసులు

న్యూఢిల్లీ, మార్చి 25 : భారత్‌లో కరోనా వ్యాప్తిరేటు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగితే మే రెండోవారం కల్లా కేసుల సంఖ్య 13 లక్షలకు చేరే అవకాశముందని శాస్త్రవేత్తలు, డాటా సైంటిస్టులతో కూడిన ఓ అంతర్జాతీయ అధ్యయన బృందం అంచనా వేసింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించడంలోనూ జాప్యం స్పష్టంగా కనిపిస్తోందని, మార్చి 18 వరకు కేవలం 11,500 టెస్టులే నిర్వహించారని వారు పేర్కొన్నారు. కరోనా రెండో, మూడో దశల్లో ప్రభుత్వ వైద్య సేవలపై మోయలేని భారం పడి.. పరిస్థితి గాడితప్పే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.


మార్చి 6 నాటికి అమెరికాలో నమోదైన కరోనా వ్యాప్తిరేటు.. మార్చి 19(13 రోజుల తర్వాత) నాటికి భారత్‌లో నమోదైన కేసులకు సమాన స్థాయిలో ఉందని విశ్లేషించారు. కరోనా తొలిదశ 11వ రోజు నాటికి వ్యాధి వ్యాప్తిరేటు ఇటలీ, అమెరికాల్లో సరిసమాన స్థాయిల్లో నమోదైందనే తులనాత్మక గణాంకాలను శాస్త్రవేత్తలు ఈసందర్భంగా గుర్తుచేశారు. వీటిని బట్టి భారత్‌ అప్రమత్తంగా వ్యవహరించకుంటే అమెరికా, ఇటలీల తరహాలోనే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చని హెచ్చరించింది. 

Updated Date - 2020-03-26T07:16:43+05:30 IST