ఆగునా జీవాలు, సాగునా లోకాలు రాజుగా మనమెంచి, రైతు చూడకపోతే!

ABN , First Publish Date - 2020-08-03T06:09:34+05:30 IST

ఇది ‘రైతు భజనావళి’ ముచ్చట. ఇది ప్రచు రించేనాటికి దేశం పరాధీనంలో కొట్టుమిట్టాడు తున్నది. జాతీయోద్యమం పురిటినొప్పులు దాటి స్వతంత్ర భారత శిశువును ప్రసవించే దిశలో పయనిస్తున్నది. బాపూజీ...

ఆగునా జీవాలు, సాగునా లోకాలు రాజుగా మనమెంచి, రైతు చూడకపోతే!

1949లో వెలువడిన ఈ గ్రంథానికి ఆచార్య రంగా తాను రాసిన ‘తొలి పలుకులు’లో పేరుకు ‘రైతు భజనావళి’ అయినా, వాస్తవానికిది ‘శ్రామిక జనావళి’ అని చెపుతూ, ‘విప్లవ పద గుచ్ఛము’గా ప్రస్తుతించారు.


ఇది ‘రైతు భజనావళి’ ముచ్చట. ఇది ప్రచు రించేనాటికి దేశం పరాధీనంలో కొట్టుమిట్టాడు తున్నది. జాతీయోద్యమం పురిటినొప్పులు దాటి స్వతంత్ర భారత శిశువును ప్రసవించే దిశలో పయనిస్తున్నది. బాపూజీ సారథ్యంలో చంపరాన్‌, బార్డోలీ సత్యాగ్రహాలు దేశంలోని రైతాంగాన్ని తట్టి మేల్కొల్పి, స్వాతంత్య్ర సందేశం పల్లెపట్టుల్లో ప్రజ లకు స్త్రీ పురుష విభేదం లేకుండా చేరువైంది. అదిగో ఆ దశలో వెలువడ్డ పుస్తకం ‘రైతు భజనావళి’. ఇటీవల పాత పుస్తకాలు వెతుకుతుంటే నాకంట బడింది. ఈ గ్రంథం నవంబరు, 1949లో వెలువ డింది. ఇది, పన్నెండవ ముద్రణ (ప్రతులు, 1000). పన్నెండు సంవత్సరాలనుండి యీ గ్రంథం వెలు వడుతున్నదని ‘మామాట’లో ప్రకాశకులు చెపుతు న్నారు. సంవత్సరానికొకసారి పునర్ముద్రణ పొందుతూ వచ్చింది. మొదటి ముద్రణ 1934. ‘రైతాంగ కవి’ బిరుదాంకితుడైన కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్యగారికి అంకితం. ఆంధ్ర రాష్ట్ర రైతు కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఆ రైతు కాంగ్రెస్‌ సంస్థ తరఫున కిసాన్‌ ప్రెస్‌, విజయవాడలో ముద్రిం చారు. వెల ఒక రూపాయి. నూరు పుటలున్న చిన్నసైజు పుస్తకం. 15 సంవత్సరాలలో పన్నెండు ప్రచురణలు పొందిన యీ గ్రంథం అట్ట లోపల దుక్కిదున్నే రైతు చిత్రాన్ని ముద్రించారు. ‘ప్రకాశకులు’ పేరుతో, ‘మా మాట’ అన్న శీర్షిక కింద- ‘‘రైతాంగంలో, తదితర శ్రామిక లోకంలో రాజకీయ చైతన్యం, విజ్ఞాన వికాసాలు కల్గించుటకు రంగాజీ తొలి పలుకులలో నుడివినట్లు యీ ‘శ్రామిక జనావళి’ పన్నెండు సంవత్స రాల నుండి ప్రచురిస్తున్నాము... వినూత్న గేయాలు ప్రతి ఏడూ మేము కోరకముందే రచయితలు మాకు దయతో అందించుచున్నందులకు వారికి మా ధన్యవాదాలు’’ అని రాశారు.


‘తొలి పలుకులు’ ఎనిమిది పుటలు ‘రంగ’ నామ ధేయంతో వున్నాయి. ‘రంగ’ అంటే ఆచార్య  రంగాగా రాజకీయాల్లో పేర్గాంచిన గోగినేని రంగనాయకులు. ఈ తొలి పలుకులలో ఒకటి, రెండు ముఖ్య విష యాలు ప్రస్తావించాలి. పేరుకు ‘రైతు భజనావళి’ అయినా, వాస్తవానికిది ‘శ్రామిక జనావళి’ అని చెపుతూ, ‘విప్లవ పద గుచ్ఛము’ గా ప్రస్తుతించారు. దేశంలో కొన సాగుతున్న రైతు, కూలి, యువ జన, విద్యార్థి ఉద్యమాలను ‘విప్లవో ద్యమాలు’గా పేర్కొన్నారు. వాటికి ‘ప్రాణము’ మహాత్ముని సత్యా హింసలనే ధర్మ సూత్రములు. సత్యాగ్రహమనే పంథా, వడి, వేడి, వెల్గు, ఉత్సాహము కలిగించగల గేయ సంపుటి, యీ రైతు భజనా వళి’’ అన్నారు. ఇంకా, ‘‘పాటల బలం మాటలలో లేదు... పాటలలో సమగ్రమగు ప్రాణము కలదు’’. పాటలలోని స్ఫూర్తిని, అది కలిగించే ఉత్తేజాన్ని ఆనాటికే స్పృహలో వుండడం గమనించాలి. నిజానికి ఆ తర్వాత పోటెత్తిన ప్రజా ఉద్యమాలకు, ఇటీవల నక్సల్‌బరీ ఉద్యమం దాకా (తెలంగాణ రైతాంగ వీరోచిత పోరాటం), ఎందరు కళాకారులు, ప్రజా పోరాటాలకు తమ పాటలతో జీవం పోశారో యీ సందర్భంలో గుర్తుకొస్తున్నది. రంగా తన ముందు మాటలో యింకా యిలా అంటున్నారు: ‘‘సర్వశ్రామిక లోకమును ఆవరించు కొనుచు, యువజనులకు నాయకులై, రైతు, కూలీ కళాకారులు, బుద్ధి జీవులందరి ఐక్యత ద్వారా’’ సర్వశ్రామిక రాజ్యమును స్థాపించే ఆశయంతో కవులు తమ రచనలు చేశారని పేర్కొన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ‘సర్వశ్రామిక రాజ్యము’ అనే భావన. ఆంధ్ర దేశంలో ఆచార్య రంగా తొలిసారిగా రైతు-కూలీ సంఘాలు స్థాపించి వారి కష్ట సుఖాలను పట్టించు కొన్నాడు. కమ్యూనిస్టు పార్టీ, రంగా, యిద్దరూ కలిసి కొన్నాళ్ళు పని చేసి, రైతుల, కూలీల మధ్య వైరుధ్యాలు వుంటాయని, వారి సమష్టి మనుగడ అసాధ్యమని, వేరుపడ్డారు. ఇక్కడ గమనించా ల్సింది, ‘సర్వ శ్రామిక రాజ్యము’ అనడంలో కార్మిక, కర్షకులకు- ఇరువురకూ చెందినదని! 


ఈ గేయ సంపుటిలోని రచనల్లో అప్పటి రాజకీయ సిద్ధాంత విభేదాలు చోటు చేసుకోలేదు. ప్రధాన దృష్టి వ్యవసాయ రంగం! అయినా, కార్మిక యితరేతర కష్ట జీవుల వెతల గూర్చి భిన్న పార్శ్వాలకు చెందిన కవులు గానం చేశారు. జనగణమన, వందేమాతరం గేయాలతో కలిపి, నూటికిపైగా రచనలున్నాయి. గరిమెళ్ళ, ముద్దుకృష్ణ, తుమ్మల, పైడిపాటి, నెల్లూరు వెంకట్రామానాయుడు, శెట్టి పల్లి వెంకటరత్నం, కొండూరు వీర రాఘవాచార్యులు, కవిబ్రహ్మ, శ్రీశ్రీ, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు, వేములపల్లి శ్రీకృష్ణ, కె.సభా... యిలా చెప్పుకుంటూ పోతే మరెందరో! ఒక ఆసక్తికర అంశం, నార్ల వెంకటేశ్వరరావు రాసిన గేయం:

సర్వసముడయ్యే సర్వేశుడుంటే

కొందరు కోట్లతో కులకగనేలా

ఎందరో గూటికి గుందగనేలా!

ఈ గ్రంథానికున్న నేటి ప్రాసంగికత ఏమిటి? భారత దేశం అనాదిగా వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అలరారింది. శతాబ్దాలుగా కొనసాగిన స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాశ్చా త్యుల రాకతో గండిపడింది. అయినా వ్యవసాయాభి వృద్ధి, ఆర్థిక వ్యవస్థలో దానికున్న ప్రాముఖ్యం తగ్గలేదు. వ్యవసాయంపై ఆధారపడ్డ కులవృత్తులూ క్షీణించలేదు. 


హరిత విప్లవం రావడంతో వ్యవసాయపు తీరు తెన్నులు మార్పు చెందాయి. సేద్యంలో కొత్త పద్ధ తులు, మేలైన వంగడాలు, రసాయనిక ఎరువులు, యాంత్రీకరణ- యివి వ్యవసాయం రూపురేఖల్ని మార్చివేశాయి. హరిత విప్లవం అంతిమంగా సంపన్న రైతులకే లాభదాయకమైంది. సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కులవృత్తులు క్రమేపీ నశించాయి. ప్రపంచీకరణ ప్రక్రియలో ఈ క్రమం మరింత ఊపందుకొని నేడు రైతు నడిబజారులో దిక్కులేనివాడుగా నిలబడ్డాడు. గత రెండు దశాబ్దాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక కోటికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. కళకళలాడే పల్లెసీమలు ఎండిపోయి, కళావిహీనమై, నిర్మానుష్యంగా తయారయ్యాయి.  


ఇది నేటి దుస్థితి. ఆనాటి పరిస్థితులూ ఆశా జనకంగా లేవు. దుక్కి దున్ని, కాయకష్టంతో తిండి ధాన్యాలు పండించే రైతు స్థితి గతులను, ఆనాటి చారిత్రక దశలో, తెలిపే కీర్తనల గ్రంథం యిది. 

వకుళాభరణం రామకృష్ణ


Updated Date - 2020-08-03T06:09:34+05:30 IST