వెంట్రుకలు ఊడుతుంటే..

ABN , First Publish Date - 2021-01-17T05:30:00+05:30 IST

హెయిర్‌ కండిషనింగ్‌ కోసం వారానికి ఒకసారి హెయిర్‌ మాస్కు పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో యువతీయువకుల్లో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటోంది. జుట్టు ఒత్తుగా,

వెంట్రుకలు ఊడుతుంటే..

ఈ మధ్య కాలంలో యువతీయువకుల్లో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటోంది. జుట్టు ఒత్తుగా, పట్టులా ఉండడానికి, కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేమిటంటే:


కొబ్బరినూనెలో మందారపూలను వేసి బాగా ఉడికించాలి. ఆ నూనెను తలస్నానానికి ముందు మాడుకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


జుట్టుపై హీట్‌ స్టైలింగ్‌ టూల్స్‌ వాడకాన్ని తగ్గించాలి.


రసాయనాలతో నిండిన హెయిర్‌ ఉత్పత్తులు కాకుండా సహజసిద్ధమైన వాటితో తయారుచేసిన ఉత్పత్తులను వాడితే జుట్టు సురక్షితంగా ఉంటుంది.


గుడ్డులోని తెల్లసొనను వెంట్రుకలకు పట్టించి పదిహేను  నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత షాంపుతో  తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టులా మృదువుగా ఉంటాయి. 

భాగా వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేస్తే వెంట్రుకల స్వభావం దెబ్బతింటుంది.


 గోరువెచ్చటి కొబ్బరినూనెతో తలను మసాజ్‌ చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బిరుసెక్కకుండా పట్టులా ఉంటాయి.


 కొవ్వు బాగా ఉండే పదార్థాలు తినడం వల్ల, కూల్‌డ్రింకులు తాగడం వల్ల కూడా వెంట్రుకలు దెబ్బతింటాయి. వాటికి బదులు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నీళ్లు బాగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఊడిపోవడం తగ్గడమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యం బాగుంటుంది.


బాగా ఎడంగా పళ్లు (వైడ్‌-టూత్డ్‌) ఉండే దువ్వెన్నను వాడడం వల్ల జుట్టు రాలదు.


హెయిర్‌ కండిషనింగ్‌ కోసం వారానికి ఒకసారి హెయిర్‌ మాస్కు పెట్టుకోవాలి.


బ్రూ కాఫీ లేదా బ్లాక్‌, గ్రీన్‌ టీ నీళ్లని చల్లారనిచ్చి వాటితో జుట్టుకు, మాడుకు  మసాజ్‌ చేసుకుని తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతుంటాయి.


Updated Date - 2021-01-17T05:30:00+05:30 IST