నేటినుంచి సచివాలయాలకు రాం రాం..!

ABN , First Publish Date - 2021-12-03T07:36:47+05:30 IST

వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమాలంటూ మంత్రి అప్పలరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

నేటినుంచి సచివాలయాలకు రాం రాం..!
చిత్తూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న వీఆర్వోలు

 మంత్రి క్షమాపణ చెప్పకుంటే దశలవారీగా ఉద్యమాలు

 వీఆర్వో సంఘ నేతల అల్టిమేటం


చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 2: వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమాలంటూ మంత్రి అప్పలరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం జిల్లావ్యాప్తంగా వీఆర్వోలు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. మంత్రి క్షమాపణ చెప్పకుంటే దశలవారీగా ఉద్యమాలకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘ జిల్లా అధ్యక్షుడు కె.బాలాజీ రెడ్డి, చిత్తూరు డివిజన్‌ ప్రెసిడెంట్‌ మార్కొండయ్య, తిరుపతి డివిజన్‌ జనరల్‌ సెక్రటరీ చెంగల్రాయులు తదితరులు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి సచివాలయాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి మాత్రమే విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రిని బర్తరఫ్‌ చేసి.. సీఎం తమకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే సచివాలయాలకు వెళ్తామని చెప్పారు.

Updated Date - 2021-12-03T07:36:47+05:30 IST