సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

ABN , First Publish Date - 2020-08-14T10:56:46+05:30 IST

తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం

మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది


మర్పల్లి: తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం వారి విధులకు ఆటంకం కలగకుండా నిమిషం పాటు ప్రభుత్వానికి రెండు చేతులతో దండం పెడుతూ వినూత్నంగా  నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ప్రభుత్వం తమ వేతనాలు పెంచడంలో పూర్తిగా విఫలమవుతోందని, ఇప్పటి కైనా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్‌, గట్టయ్య తదితరులు ఉన్నారు. 


ప్రైవేటీకరిస్తే సహించం

ఘట్‌కేసర్‌ రూరల్‌: కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే  సహించేది లేదని సీఐటీయూ జిల్లా కోశాధికారి నార్కెట్‌పల్లి సబిత హెచ్చరించారు. మండలంలోని ఘనాపూర్‌లోని ఫవర్‌గ్రిడ్‌ సంస్థ ఎదుట గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని  నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ కార్మికుల నడ్డివిరుస్తోందని ఆరోపించారు. కార్పోరేట్‌ వక్తులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. దేశంలోనే కీలక రంగాలైన బొగ్గు, రైల్వే, రక్షణ, విమానయాన, ఫార్మా, అంతరిక్షయానం సంస్థలను ప్రెవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మీ, సత్యనారాయణ, శంకర్‌, దాసు పద్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-14T10:56:46+05:30 IST