దంతాలు మెరవాలంటే..!

ABN , First Publish Date - 2021-05-20T04:33:36+05:30 IST

మిలమిలమెరిసే దంతాలు ముఖారవిందాన్ని పెంచుతాయి. దంతాలు మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...

దంతాలు మెరవాలంటే..!

మిలమిలమెరిసే దంతాలు ముఖారవిందాన్ని పెంచుతాయి. దంతాలు మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...

  • దంతాలు తెల్లగా కావాలంటే బేకింగ్‌ సోడా చక్కగా ఉపకరిస్తుంది. బేకింగ్‌సోడాను అరచెంచా తీసుకుని టూత్‌పేస్ట్‌తో మిక్స్‌ చేసుకుని బ్రష్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార తొలగిపోతుంది. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే చాలు.
  • నిమ్మలో బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. ఇది దంతాల పసుపుదనాన్ని అద్భుతంగా పోగొడుతుంది. నిమ్మ తొక్కలను తీసుకుని దంతాలపై రాసుకోవడం లేదా నిమ్మరసంను కొన్ని నీళ్లలో కలుపుకొని నోట్లో పోసుకుని పుక్కిలించినా సరిపోతుంది. 
  • రోజూ ఒక యాపిల్‌ తింటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దంతాలు కూడా తెల్లగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. యాపిల్‌లో ఉన్న అమ్ల గుణం దంతాలు మెరిసేలా చేస్తుంది.
  • స్టాబెర్రీలకు దంతాలు మెరిసేలా చేసే గుణం ఉంది. స్టాబెర్రీలను పేస్ట్‌ మాదిరిగా చేసి దంతాల మీద రబ్‌ చేస్తే దంతాలు తెల్లగా అవుతాయి. 
  • దంతాలు మెరిసేలా చేయడంలో తులసి కూడా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను పేస్ట్‌ మాదిరిగా చేసి పళ్లు తోముకుంటే దంతాలు మెరుస్తాయి.
  • నారింజ తొక్కల్లో కాల్షియం, విటమిన్‌ సి ఉంటుంది. వీటికి నోట్లో బ్యాక్టీరియాపై పోరాడే గుణం ఉంటుంది. అంతేకాకుండా దంతాలు పసుపు రంగుకు మారకుండా కాపాడుతుంది. కాబట్టి వారంలో మూడు రోజులు నారింజ తొక్కలతో దంతాలను రబ్‌ చేయాలి.

Updated Date - 2021-05-20T04:33:36+05:30 IST