తహసీల్దార్లు నిర్ధారిస్తే..కౌలు రైతుల ధాన్యం కొంటాం

ABN , First Publish Date - 2021-12-02T05:30:00+05:30 IST

కౌలు రైతులు వరి సాగు చేసినట్లు తహసీల్దార్లు ధ్రువీకరిస్తే ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తారని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు.

తహసీల్దార్లు నిర్ధారిస్తే..కౌలు రైతుల ధాన్యం కొంటాం
భూత్పూర్‌ కొనుగోలు కేంద్రంలో మహిళా రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు


భూత్పూర్‌, డిసెంబరు 2 : కౌలు రైతులు వరి సాగు చేసినట్లు తహసీల్దార్లు ధ్రువీకరిస్తే ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తారని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. గురువారం భూత్పూర్‌లోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మహిళా రైతులతో కలెక్టర్‌ మాట్లాడారు. గన్నీ బ్యాగుల  కొరత ఉందని కొంత మంది రైతులు కలెక్టర్‌కు విన్నవించగా,  ఆయన ప్రాథమిక సహకార సంఘం గోడౌన్‌లో బ్యాగులను పరిశీలించారు. రైతులకు గన్నీ బ్యాగుల కొరత రానీయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక మునిసిపాలిటీ కార్యాలయంలో విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 187 వరి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 37,235 మెట్రిక్‌ టన్నుల దాన్యం కొనుగోలు చేసి, రూ. 11.10కోట్లు రైతులకు అందించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, సింగిల్‌ విండో సీఈవో రత్నయ్య, మునిసిపల్‌ మేనేజర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయండి


15 రోజుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు మండల వైద్యాధికారులకు సూచించారు. గురువారం ఉదయం భూత్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సిబ్బంది ఉదయమే గ్రామాలకు వెళ్లి ప్రజలకు సేవలు అందివ్వాలని ఆదేశించారు. అదే విధంగా అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతారామారావు తదితరలు ఉదయం భూత్పూర్‌ మండలంలోని అన్నాసాగర్‌, ఇతర ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణ, మండల వైద్యాధికారి సత్యనారాయణ, సీహెచ్‌వో రామయ్య ఉన్నారు.


పది రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి


జడ్చర్ల, డిసెంబరు 2 : జడ్చర్ల పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చే యాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్ల లోని మిషన్‌ భగీరథ అతిథిగృహంలో గురువారం సాయంత్రం జడ్చర్ల అర్బన్‌, రూరల్‌ అధికారులతో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న పది రోజుల్లోగా పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినే షన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ వేసుకో ని వారిని గుర్తించాలని, వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతం లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించా లని, మొదటి డోసు బాగానే ఉన్నా, రెండవ డోసుపై దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సినేషన్‌ అంశంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. మిషన్‌భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, జడ్చర్ల మండల ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈఓ జ్యోతి, జిల్లా మలేరియా అధికారి విజ య్‌కుమార్‌, జడ్చర్ల, గంగాపురం పీహెచ్‌సీల అధికా రులు డాక్టర్‌ శివకాంత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ జగదీష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-02T05:30:00+05:30 IST