ఇంట్లో మొక్కలు ఉంటే...

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

వర్షాలు పడుతున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలపై దృష్టిసారించాల్సిన సమయం ఇది. మొక్కల సంరక్షణ కోసం ఇప్పుడేం చేయాలంటే...

ఇంట్లో మొక్కలు ఉంటే...

వర్షాలు పడుతున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలపై దృష్టిసారించాల్సిన సమయం ఇది. మొక్కల సంరక్షణ కోసం ఇప్పుడేం చేయాలంటే...


  • వర్షాలు కురుస్తున్న సమయంలో డ్రైనేజీలు బ్లాక్‌ కాకుండా చూసుకోవాలి. కుండీలలో, కంటెయినర్‌లలో నీరు నిలువ ఉండకూడదు. నీరు నిలువ ఉంటే మొక్క వేర్లు దెబ్బతింటతాయి. వర్షపు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి కుండీలో నీళ్లు సాఫీగా వెళ్లిపోయేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కుండీలో మట్టి ఎండిపోయినట్టుగా ఉంటే తప్ప మొక్కలకు నీళ్లు పోయకూడదు. మొక్క చనిపోవడానికి నీళ్లు ఎక్కువగా పోయడం కూడా కారణమే అవుతుంది.
  • వానపాములు మొక్కలకు మంచి మిత్రులు. అవి కుండీల్లో లేదా రూఫ్‌ గార్డెన్‌లో కనిపిస్తే కనుక వాటిని తీసి వేయకూడదు.
  • మొక్కల పాదుల దగ్గర చెత్త లేకుండా తొలగించాలి. మట్టి గుల్లబారేలా మొక్క కాండం దగ్గర తవ్వాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది. వేర్లను తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. 
  • రసాయనిక ఎరువులు కాకుండా న్యాచురల్‌ ఫర్టిలైజర్స్‌ను ఎంచుకోవాలి. వర్మికంపో్‌స్టను ఉపయోగించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.

Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST