పరిమిత సంఖ్యలో ఉంటేనే శుభ కార్యాలకు వస్తాం..

ABN , First Publish Date - 2021-05-10T05:46:41+05:30 IST

రోజురోజుకు పెరిగిపోతున్న కరోన పాజిటివ్‌ కేసులు, మరణాల నేఫాథ్యంలో సుల్తానాబాద్‌ ప్రాంతంలోని పురోహితులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.

పరిమిత సంఖ్యలో ఉంటేనే శుభ కార్యాలకు వస్తాం..
సమావేశంలో మాట్లాడుతున్న వేద పండితులు

- పురోహితుల సంఘం నాయకుల వెల్లడి

సుల్తానాబాద్‌, మే9: రోజురోజుకు పెరిగిపోతున్న కరోన పాజిటివ్‌ కేసులు, మరణాల నేఫాథ్యంలో సుల్తానాబాద్‌ ప్రాంతంలోని పురోహితులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కన్యకా పరమేశ్వరి అలయంలో మండల పురోహితుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కేసులు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో తమది ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. శుభ, అశుభ కార్యాలకు వెళ్లాలంటే తమకు భయం కలుగుతోంద ని, ప్రజలు పరిమిత సంఖ్యలో ఉండకపోగా ఎలాంటి జాగ్ర త్తలు కూడా పాటించడంలేదన్నారు. త్వరలో మంచి ము హూర్తాలు రానున్న ఈ తరుణంలో తాము పౌరోహిత్యం చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు సంఘం వారు పలు తీర్మానాలు చేశారు. తమచే కార్యక్రమాలు నిర్వహించే వారేవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పరిమిత సంఖ్యలో ప్రజలు పాల్గొంటేనే తాము వస్తామని స్పష్టం చేశారు. ఇది వరకే ముహూర్తాలు పెట్టుకున్న వారు నిబంధ నలకు లోబడి వాటిని నిర్వహించుకోవాలని, లేదంటే ముహూర్తాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని సూచిం చారు. ఈ సమావేశంలో పురోహిత సంఘం అధ్యక్షులు  ఉప్పరమల్యాల చంద్రశేఖర శర్మ, పారువెళ్ల రమేష్‌ శర్మ, సంతోష్‌ శర్మ, ఉప్పరమల్యాల లక్ష్మణ శర్మ, రొట్టె రామన్న శర్మ, వల్లంకొండ రమేష్‌, మహేష్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:46:41+05:30 IST