యోగలక్ష్మీ నమోస్తుతే

ABN , First Publish Date - 2021-12-03T07:13:15+05:30 IST

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనసేవ జరిగింది.

యోగలక్ష్మీ నమోస్తుతే
ముత్యపుపందిరిపై ఆదిలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు, సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో పద్మావతీదేవి, అమ్మవారికి స్నపన తిరుమంజనం

తిరుచానూరు, డిసెంబరు 2: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనసేవ జరిగింది. వేకువజామున అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపు చేసి ముత్యపుపందిరి వాహనంలో కొలువుదీర్చారు. ఆదిలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని వాహనంపై అధిష్ఠింపచేశారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.సాయంత్రం వాహన మండపంలో సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో అమ్మవారిని అధిష్టింపచేశారు. ఈ కార్యక్రమంలో జియ్యర్‌ స్వాములు, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర రెడ్డి, ఏవీఎస్వో వెంకటరమణ, ఆలయ సూపరింటెండెంట్లు మధు, శేషగిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌, రాజే్‌షఖన్నా, దాము, వీఐలు మహేష్‌, సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష, రాత్రి హనుమంత వాహనసేవ జరగనుంది. 

Updated Date - 2021-12-03T07:13:15+05:30 IST