సంగీతాలో స్మార్ట్‌ఫోన్‌ కొంటే...

ABN , First Publish Date - 2020-09-19T05:44:24+05:30 IST

సంగీతా మొబైల్స్‌ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే ప్రతీ కస్టమర్‌కు లక్ష నుంచి 5లక్షల మధ్యలో కొవిడ్‌ లైఫ్‌ కవరేజ్‌ బీమాను అందిస్తోంది.

సంగీతాలో స్మార్ట్‌ఫోన్‌ కొంటే...

రూ.5 లక్షల కొవిడ్‌ లైఫ్‌ కవరేజ్‌


బెంగళూరు (ఆంధ్రజ్యోతి): సంగీతా మొబైల్స్‌ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే ప్రతీ కస్టమర్‌కు లక్ష నుంచి 5లక్షల మధ్యలో కొవిడ్‌ లైఫ్‌ కవరేజ్‌ బీమాను అందిస్తోంది. ప్రస్తుత క్లిష్ట సమయంలో తమవంతుగా ప్రతి కొనుగోలుదారుడికి బీమా కంపెనీలతో సంబంధం లేకుండా లైఫ్‌ కవరేజీ ఇవ్వదలచామని సంగీతా మొబైల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర ఆంధ్రజ్యోతికి తెలిపారు.


46వ వార్షికోత్సవ ఆఫర్లు అక్టోబరు 11 వరకు ఉంటాయని ఆయన తెలిపారు. కొవిడ్‌ సంక్షోభంలో కూడా తాము ఒక్క ఉద్యోగినైనాతొలగించకుండా సంపూర్ణ వేతనాలు ఇవ్వడంతో పాటు 2500 మందికి రూ.5 లక్షల బీమా కూడా అందించినట్టు చెప్పారు. 





ఇప్పుడు తాము మొబైల్‌ ఫోన్లతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు అవసరమైన  ల్యాప్‌ట్యాబ్‌లు, ట్యాబ్‌, వాక్యూమ్‌ క్లీనర్‌లు, స్మార్ట్‌ టెలివిజన్‌లు, ఎయిర్‌ ఫ్యూరిఫైర్‌లు, ట్రిమ్మర్‌లను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. 


ఇతర ఆఫర్లు...

ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపైనా అప్పటికప్పుడే రూ.500 నుంచి రూ.5 వేల వరకు క్యాష్‌బాక్‌, ఎస్‌బీఐ కార్డు ద్వారా చెల్లిస్తే మరో రెండు వేలు ప్రయోజనం

ప్రతి కొనుగోలుదారుడికి ఉచితంగా పేటీఎం ఫస్ట్‌కార్డు సభ్యత్వం. దీని ద్వారా అపోలో ఫార్మసీల్లో 3 నెలల పాటు ఔషధాలపై 15 శాతం రాయితీ, ఒకసారి డాక్టర్‌ కన్సల్టెన్సీ.

సంగీతాలో 30 రోజుల్లోగా మొబైల్‌ ధర తగ్గితే సొమ్ము వాపసు, ఉచితంగా6 నెలల డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌

ఆన్‌లైన్‌ కన్నా తక్కువ ధరలోనే ఐ ఫోన్‌

Updated Date - 2020-09-19T05:44:24+05:30 IST