Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణ‌క్య నీతి: మీరు ఈ ప‌నులు చేయ‌క‌పోతే.. మీ శ‌త్రువుల‌కు బ‌లం చేకూర్చిన‌వార‌వుతారు.. త‌క్ష‌ణం మీ తీరు మార్చుకోండి!

ఆచార్య చాణక్య ప‌లు నైతిక విలువ‌ల‌ను బోధించి ప్రజలకు మంచి మార్గదర్శకత్వాన్ని అందించాడు. వ్యూహ‌ ర‌చ‌న‌ల‌లో ప్రసిద్ధి చెందిన చాణక్యకు సమాజంలోని దాదాపు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంది. శత్రువు మ‌న‌ల్ని బ‌ల‌హీన‌ప‌రిచేందుకు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని ఆచార్య చాణక్య సూచించారు. ఎందుకంటే ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంద‌ని హెచ్చ‌రించాడు. ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. శత్రువులు రెండు రకాలు. మొదటి వారిని మ‌నం చూడ‌గలం. రెండ‌వ త‌ర‌హా వారిని మ‌నం క‌నిపెట్ట‌లేం. చాణ‌క్య నీతి ప్ర‌కారం ఈ రెండు రకాల శత్రువులు చాలా ప్రమాదకరమైనవారే. వారు అవకాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా మీపై దాడికి ప్ర‌య‌త్నిస్తారు. అందుకే అలాంటి వారితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం మ‌నిషి ఎటువంటి గుణాలు క‌లిగి ఉండాలో చాణ‌క్య తెలిపారు. 

మీ ఇమేజ్‌ని మెరుగుపరచుకోండి

ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల ప్రకారం, ఒక వ్యక్తి తన ఇమేజ్ గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఇమేజ్ ప‌డిపోతే, మీ శత్రువు దానిని సద్వినియోగం చేసుకుంటాడు.

అహంకారానికి దూరంగా ఉండండి

మనిషికి అహంకారం అతిపెద్ద శత్రువు. కాబట్టి, ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉండాలి. అహంకారం వల్ల మనిషి పతనమవుతాడ‌ని చాణ‌క్య తెలిపారు. 

వినయాన్ని క‌లిగి ఉండండి

మీరు మీ శత్రువును ఓడించాలనుకుంటే, మీలో మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి. వినయపూర్వకమైన వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుందని చాణక్య విశ్వసిస్తారు.

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి

మ‌నిషి త‌న కలలను సాకారం చేసుకునేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ధైర్యంగా, తెలివిగా ఎదుర్కోవాలి, అప్పుడే మనిషి తన ఆశ‌ల‌ను నెరవేర్చుకోగలుగుతాడు.  ధైర్యాన్ని వదులుకుంటే లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుందని చాణ‌క్య తెలిపారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement