మీ చాట్‌ ఆటోమేటిగ్గా... డిలీట్‌ కావాలంటే...?

ABN , First Publish Date - 2021-02-07T19:26:34+05:30 IST

నెటిజన్‌లు స్వేచ్ఛాజీవులు. ఆ క్షణానికి అనిపించిన అభిప్రాయాలను బట్టి చాట్‌ చేస్తుంటారు.

మీ చాట్‌ ఆటోమేటిగ్గా... డిలీట్‌ కావాలంటే...?

నెటిజన్‌లు స్వేచ్ఛాజీవులు. ఆ క్షణానికి అనిపించిన అభిప్రాయాలను బట్టి చాట్‌ చేస్తుంటారు. చాటింగ్‌ లేదా పోస్టులు చేసినప్పుడు.. కొన్నిసార్లు పొరపాట్లు కూడా దొర్లుతుంటాయి. వాట్సప్‌లో అయితే వాటిని వెంటనే డిలీట్‌ చేయొచ్చు. సమయం మించిపోతే చేయలేం. అయితే కొత్త వెర్షన్‌లో ఆ గడువును 1 గంట 8 నిమిషాల 16 సెకెన్లకు పొడిగించింది వాట్సాప్‌. ఇలా మనం ప్రయత్నపూర్వకంగా డిలీట్‌ చేస్తే తప్ప ఆ పోస్టులను తొలగించలేం. అయితే ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యమిచ్చే ‘సిగ్నల్‌’ యాప్‌ ఒక అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మనం ఎవరికి అయితే పోస్టులు పెడుతున్నామో వారు చూసిన తక్షణమే వాటంతట అవే డిలీట్‌ (డిజప్పియర్‌) అయ్యే అవకాశం ఇచ్చింది. మనం చేసిన పోస్టులను 5 సెకన్ల నుంచి 1 వారంలోపు డిజప్పియర్‌ చేసుకోవచ్చు. అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Updated Date - 2021-02-07T19:26:34+05:30 IST