Abn logo
Sep 25 2021 @ 00:00AM

పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే...

కొందరు పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. కానీ దేనిపైన ఏకాగ్రత నిలపలేరు. అటువంటి వాళ్లను గుర్తించి అవసరమైన తోడ్పాటు అందించాలి. 


పిల్లలు కొత్త విషయాలను సులువుగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేయాల్సిందల్లా వాళ్లకు తగిన ప్రోత్సాహాన్ని అందించడమే. పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఆటలు ఎక్కువ ఆడేలా చూడాలి. క్రాస్‌వర్డ్స్‌ పజిల్స్‌, పిక్చర్‌ పజిల్స్‌ వంటి ఏకాగ్రతను పెంచుతాయి. చెస్‌, ల్యూడో వంటి బోర్డ్‌ గేమ్స్‌ కూడా ఉపయోగపడతాయి.


పిల్లలకు మంచి ఆహారం అందించాలి. ఆకుకూరలు, సాల్మన్‌ వంటి చేపలు, బెర్రీస్‌, ఫ్రూట్స్‌ వంటివి పిల్లల్లో మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


పిల్లలు హోం వర్క్‌ పూర్తి చేసినప్పుడు, మంచి డ్రాయింగ్‌ వేసినప్పుడు ప్రోత్సహించాలి. అది వాళ్లలో ఎంతో ప్రేరణ నింపుతుంది. అలాంటప్పుడు వాళ్లకు ప్రత్యేకమైన ట్రీట్‌ ఇవ్వాలి. ఇంకోసారి ఎక్స్‌ట్రా రివార్డు ఇస్తానని చెప్పాలి. అప్పుడు పిల్లలు మరింత ఏకాగ్రతతో పనిపైన దృష్టిపెడతారు.