14రోజులు పని చేస్తే.. రూ.9లక్షల జీతం.. చిన్న షరతు ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-25T03:15:33+05:30 IST

ఈ కాలంలో రోజంతా కష్టపడితే గానీ పూట గడవడం కష్టం. అలాంటిది 14రోజులకు రూ.9లక్షల జీతమంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. కానీ ఇది అక్షరాలా నిజం. అది కూడా చాలా సులభమైన పని. ఏ పనికైనా షరతులు ఉన్నట్లే.. ఇందులో కూడా

14రోజులు పని చేస్తే.. రూ.9లక్షల జీతం.. చిన్న షరతు ఏంటంటే..

ఈ కాలంలో రోజంతా కష్టపడితే గానీ పూట గడవడం కష్టం. అలాంటిది 14రోజులకు రూ.9లక్షల జీతమంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. కానీ ఇది అక్షరాలా నిజం. అది కూడా చాలా సులభమైన పని. ఏ పనికైనా షరతులు ఉన్నట్లే.. ఇందులో కూడా ఓ షరతు ఉంది. అది కూడా చాలా చిన్న షరతు. ఇంత చిన్న పనికి అంత డబ్బులా అని ఆలోచిస్తున్నారు కదా.. ఆ పని ఎక్కడ, ఆ షరతు ఏంటో తెలుసుకుందామా..


స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో ఈ పని చేయాల్సి ఉంటుంది. అక్కడి ఓ ధనిక కుటుంబం వ్యాపార నిమిత్తం బయటి దేశాలకు వెళ్తోంది. దీంతో వచ్చే క్రిస్మస్ సందర్భంగా వారి పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్ అవసరం. అందుకే ఇంత మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారు. వారు చెప్పినదాని ప్రకారం.. డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు వారి ఇంట్లో ఉండాలి. ఈ 14 రోజులు సొంతింటికి వెళ్లకుండా.. వారి పిల్లలను చూసుకోవాలనేదే వారు పెట్టిన షరతు.


అక్కడి వెళ్లే వారు క్రిస్మస్ చేసుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచిస్తున్నారు. 24గంటల పాటూ వారి పిల్లలను వదిలి బయటకు వెళ్లకూడదు. వారికి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్ని పనులూ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్లే ముందు కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేసుకుని ఉండాలి. పోవడానికి, రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులన్నీ.. తామే భరిస్తామని యజమాని చెబుతున్నాడు.

Updated Date - 2021-11-25T03:15:33+05:30 IST