Abn logo
Sep 23 2021 @ 23:42PM

కార్మిక కోడ్‌లు రద్దు చేయాలని ఇఫ్టూ డిమాండ్‌

నిరసన తెలియజేస్తున్న ఇఫ్టూ ప్రతినిధులు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 : లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సిం గ్‌, స్కీం వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. విశాఖ నగరం అక్కయ్యపాలెం ప్రధాన రోడ్డులో ఉన్న కార్మికశాఖ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించరాదని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.


విశాఖలో శాశ్వత జేసీఎల్‌ని నియమించాలని, యాజమాన్యాల దౌర్జన్యాలు అరికట్టాలని, సాలూరు, కొత్తవలస జ్యూట్‌ యాజమాన్యాల చట్ట విరుద్ద లాకౌట్‌ను నిషేధించి కార్మికులకు పనికల్పించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులన్నీంటిపైనా వెంటనే విచారణ ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు.


అనంతరం డీసీఎల్‌కి వినతి పత్రం సమర్పించారు. నిరసనలో నాయకులు వై.కొండయ్య, కె.మల్లయ్య, పాపినాయుడు, త్రిమూర్తులు, శ్రీను, దుర్గ, చింతల లక్ష్మి, పాల్గొన్నారు.