Abn logo
Sep 25 2021 @ 00:30AM

ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించం


ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన మంజుల హెచ్చరిక

అనంతపురం టౌన, సెప్టెంబరు 24: ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన మాల్యవంతం మంజుల పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్నారు. శుక్రవారం ఆమె అనంతపురం బస్టాండును తనిఖీ చేశారు. తొలుత బస్టాండులో స్టేషన మేనేజర్‌ కూడా లేకపోవడంతో ప్రయాణికులకు ఏదైనా సమస్య తలెత్తితే ఎవరిని సంప్రదించాలంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం డిపో మేనేజర్‌ పిచ్చయ్య, డిప్యూటీ సీటీఎం గోపాల్‌రెడ్డి, రీజనల్‌ మేనేజర్‌ సుమంత ఆర్‌ ఆదోని ఒకరితర్వాత ఒకరు అక్కడికి చేరుకున్నారు. వా రితో కలిసి జోనల్‌ చైర్‌పర్సన బస్టాండు మొత్తం కలియదిరిగారు. మూత్రశాలల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. అనంతరం డిపో ఆవరణం నుంచి బయటకు వస్తున్న తిరుపతి రూట్‌ బస్సును ఆపి, తనిఖీ చేశారు. బస్సుకు శానిటైజేషన చేశారా..? అని డ్రైవర్‌ను ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చాడు. బస్టాండు ఆవరణలో పేరుకుపోయిన చె త్తా చెదారాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. బస్టాండు నిర్వహణ చాలా అధ్వానంగా ఉందనీ, ప్రయాణికుల సౌకర్యాన్ని గాలికొదిలేసారని మండిపడ్డారు. గ్యారేజీల్లోనూ రోజూ షెడ్యూల్‌-1 వాహన పరిశీలనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.