ఆన్‌లైన్ పాఠాలు బుర్రకెక్కట్లేదా? అయితే ఓ చక్కటి పరిష్కారం ఇదిగో..

ABN , First Publish Date - 2021-04-27T01:50:57+05:30 IST

ప్రయోగాలు అవసరమయ్యే సైన్స్ పాఠాలు అర్థం చేసుకోలేకపోవడం, క్లాస్‌రూం వాతావరణానికి దూరంగా ఉండటం వంటి సమస్యలతో విద్యార్థులు ఈ పద్ధతితో పూర్తిగా మమేకం కాలేకపోతున్నారు. పాఠాలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. ఉంది అని మనీష్ కుమార్.

ఆన్‌లైన్ పాఠాలు బుర్రకెక్కట్లేదా? అయితే ఓ చక్కటి పరిష్కారం ఇదిగో..

ఇంటర్నెట్ డెస్క్: ఈ-లెర్నింగ్.. కరోనా అనంతర ప్రపంచంలో విద్యావ్యవస్థకు కీలకంగా మారిన బోధనా విధానం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇంతకుమునుపే ఈ పద్ధతి గురించి తెలిసినపన్పటికీ.. భౌతిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరంగా మారింది. అయితే.. ఇందులోని కొన్ని ప్రధానమైన సమస్యల కారణంగా విద్యార్థులకు అనుకున్న ప్రయోజం చేకూరట్లేదు. ముఖ్యంగా.. ప్రయోగాలు అవసరమయ్యే సైన్స్ పాఠాలు అర్థం చేసుకోలేకపోవడం,  క్లాస్‌రూం వాతావరణానికి దూరంగా ఉండటం వంటి సమస్యలతో విద్యార్థులు ఈ పద్ధతితో పూర్తిగా మమేకం కాలేకపోతున్నారు. పాఠాలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. ఉందని అంటున్నారు మనీష్ కుమార్. ఐఐటీ పట్టభద్రుడైన మనీష్ ఇప్పటికే తన ఆవిష్కరణలపై 12 పేటెంట్లు సాధించారు. విద్యావ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రస్తుతం తరుణంలో మనీష్ తన ‘క్యూరియస్ మైండ్స్ ఇన్‌స్టిట్యూట్’ ద్వారా ఈ-లెర్నింగ్ సమస్యలకు చెక్‌పెట్టే ఓ విన్నూత పద్ధతికి రూపకల్పన చేశారు.


సైన్స్ పాఠాలకు ప్రయోగాలు ఎంతో కీలకం! అయితే.. ఆన్‌లైన్ విద్యలో ఈ ప్రయోగాలు యానిమేషన్‌లో కనిపిస్తాయి. ఇది కొంత కృత్రిమంగా ఉండటంతో విద్యార్థులు క్రమంగా ఆసక్తి కోల్పోతున్నారు. అయితే..మనీష్ రూపొందించిన ఈ-లెర్నింగ్ వేదిక ద్వారా విద్యార్థులు ఈ ప్రయోగాలను లైవ్‌లో చూడగలుగుతారు. దీంతో.. వారికి పాఠాల పట్ల ఆసక్తి ఇనుమడిస్తుంది. ఈ విధానం ప్రత్యేకత ఏంటంటే.. విద్యార్థులు తమ ఇళ్లలో అందుబాటులో ఉండే సామాగ్రితో ఈ ప్రయోగాలను మళ్లీ మళ్లీ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తద్వారా పాఠాలను పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకునే అవకాశం వారికి కలుగుతుంది. ఇక ఈ లెర్నింగ్ విధానంలోని రెండో సమస్య..క్లాస్‌రూం వాతావరణాన్ని కల్పించలేకపోవడం. కేవలం నాలుగు గోడల మధ్యే పరిమితమవుతూ నిరంతరంగా కంప్యూటర్ స్క్రీన్ల‌ను కళ్లు అప్పజెప్పడం వల్ల విద్యార్థుల మానసిక వికాసానికి దూరం అవుతున్నారు. ఈ సమస్యకు కూడా ‘క్యూరియస్ మైండ్స్’ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పిల్లల మానసిక వికాసానికి అధిక ప్రాధాన్యమిస్తూ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పతుతోంది.


ఐఐటీ చదువు..కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నత స్థానం.. వీటన్నింటీని వదిలి పెట్టి మనీష్ కుమార్ క్యూరియస్ మైండ్స్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. అసలు ఈ ఆలోచనకు ప్రేరణ ఏమిటీ అంటే.. వృత్తిగత జీవితంలో తాను చూసిన ఎన్నో ఘటనలే కారణమని మనీష్ చెబుతున్నారు. ‘‘వృత్తిగత జీవితంలో నేను ఎంతో మందిని కలిశాను. వారిలో పలువురు విద్యార్థులుగా ఉన్నప్పుడు పాఠాలను బట్టీ వేయడం వరకే పరిమితమయ్యారు. ఓ దశాబ్దం తరువాత వారి ఉద్యోగం జీవితం సవాళ్లమయమైపోయింది. అయితే.. చదువు కంటే కేవలం పాఠాలు మాత్రమే కాదు. పాఠాలకు ఆవల తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుత విద్యావ్యవస్థ స్టూడెంట్లను సమాచారం గుర్తుపెట్టుకునే యంత్రాల కింద మార్చేసింది. పాఠాల వెనుక ఉన్న తర్కమీమాంశాలకు విద్యార్థులు దూరంగా ఉండిపోతున్నారు. ఈ విషయాలపై అవగాహన పెరిగేలా ప్రాక్టికల్సే కేంద్రంగా విద్యాబోధన జరగాలి. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ పటిష్టమైన చర్యలేవీ ప్రారంభం కాలేదు. అందుకే నేను కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి క్యూరియస్ మైండ్స్ ప్రారంభించాను. మా కార్యక్రమం ‘లీప్’(LEAP) ద్వారా విద్యార్థులకు ప్రయోగాలు ప్రధానమైన విద్యను అందిస్తున్నాం. ఈ పద్ధతిలో క్లాసులు వినేందుకు విద్యార్థులు వారానికి కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు కేటాయిస్తూ..మరో నాలుగు నుంచి ఆరు గంటల పాటు పాఠాల పునశ్చరణ చేస్తే విద్యార్థులు కోరిన ప్రయోజనం చేకూరుతుంది’’ అని మనీష్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-27T01:50:57+05:30 IST